ముఖ్యంశాలుహోమ్

లోకేష్‌కి అదానీ టీవీ మద్దతు…. జగన్‌కి బిగ్‌ షాక్‌..??

#Lokesh

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి.. ఆదానీ గ్రూపు సంస్థలకు మధ్య అవినాభావ సంబంధం ఉందని ఇటు పొలిటికల్‌ సర్కిల్స్‌లోనూ.. అటు పారిశ్రామిక వర్గాల్లోనూ గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. జగన్‌ హయాంలో ఏపీలోని ప్రైవేటు పోర్టుల్లో చాలా వరకు ఆదానీ చేతికి వెళ్లాయి. కొన్ని ప్రైవేటు ధర్మల్‌ పవర్‌ ప్లాంట్లను ఆదానీ కంపెనీలు కొనేశాయి. ఇక సెకీ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో.. ఆదానీ గ్రూపు కంపెనీ నుంచి జగన్‌ ప్రభుత్వానికి.. 1700 కోట్ల ముడుపులు ముట్టాయని అమెరికా స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఎస్‌ఈసీ ఆరోపించింది. ఈ అంశంపై అమెరికా కోర్టులో కేసు కూడా నడుస్తోంది.

బిజినెస్ వ్యవహారాలకు తోడు.. ఆదానీ గ్రూప్‌ యాజమాన్యంలో ఉన్న ఎన్‌డీటీవీ న్యూస్‌ ఛానల్‌లో జగన్‌కి అనుకూలంగా.. వైసీపీ స్టాండ్‌ వినిపించేలా వార్తలు వస్తూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే ట్రెండ్‌ కంటిన్యూ అవుతోందని మీడియా అనలిస్టుల అభిప్రాయం. అయితే జగన్‌ సీఎంగా ఉన్న ఐదేళ్లలో విమానాల్లో విహార యాత్రలకు ఏకంగా 222 కోట్లు తగలేశారనే వార్త బయటకు వచ్చింది. సాధారణంగా జగన్‌ అనుకూల మీడియాలో ఈ న్యూస్‌ని ప్రసారం చేయరు. ఒకవేళ్ల పబ్లిష్ చేసినా.. దాన్ని వక్రీకరించి జగన్‌ని సమర్ధించే యాంగిల్‌లోనే ప్రజెంట్‌ చేస్తారు.

అయిత ఎన్‌డీటీ ఇంగ్లీష్‌ ఛానల్‌లోనూ, వెబ్‌సైట్‌లోనూ జగన్‌ దుబారాపై పెద్ద కథనమే ఇచ్చారు. అధికారంలో ఉండగా విమానాల్లో షికార్లకు 222 కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేయడంపై… జగన్‌ మీద దుమ్మెత్తి పోసింది. ఆదానీ మీడియాలో జగన్‌రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రావడం.. ఆ పార్టీ పెద్దలకు షాక్‌ కొట్టే విషయమే అవుతుంది. తెలుగు మీడియాలో ఎలా ఉన్నా.. నేషనల్‌ మీడియాలో తనకు వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు రాకుండా.. వైఎస్ జగన్‌.. చాలా జాగ్రత్తలు తీసుకొంటారని.. రెగ్యులర్‌గా వార్తలు చూసే వాళ్లకు బాగా తెలుసు. దుబారా ఖర్చు విషయంలో ఆదానీ మీడియా జగన్‌ని వేలెత్తి చూపించడంతో… నేషనల్‌ మీడియా మీద వైసీపీ ఉడుం పట్టు కొంచెం వదులైందని అనుకోవాల్సిందే.

Related posts

నారాయణ భక్తి మార్గం పై సటైర్లు…

Satyam News

స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్షించిన ముఖ్య కార్యదర్శి

Satyam News

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

Satyam News

రాలిపోయిన ధృవతార: ఆశా భోంస్లే ఇక లేరు

Satyam News

కల్తీ నెయ్యిపై మరో కమిటీ..నిర్ణయం సరైనదేనా?

Satyam News

ఏపీఎస్పీలో హెడ్ కానిస్టేబుళ్లకు ప్రత్యేక పదోన్నతులు

Satyam News

Leave a Comment