ముఖ్యంశాలుహోమ్

ఫైబర్ నెట్ విస్తృత పరిచేందుకు పటిష్ట ప్రణాళిక

#APFibernet

ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లు మరింత విస్తృతంగా పెంచేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. నేడు సచివాలయంలోని ఆర్ & బీ శాఖ కార్యాలయంలో ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (APSFL)పురోగతిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు లోకల్ కేబుల్ ఆపరేటర్ లు ప్రస్తావించిన పలు సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజలకు ఏపీ ఫైబర్ నెట్ ద్వారా మెరుగైన, విస్తృతమైన సేవలు అందించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని మంత్రి కోరారు.

సీఎం చంద్రబాబు మానస పుత్రిక అయిన ఫైబర్ నెట్ వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, మళ్లీ తిరిగి ఏపీ ఫైబర్ నెట్ వ్యవస్థకు పునరుత్తేజం తీసుకొచ్చేందుకు సంస్థ మరింత కష్టపడి పనిచేయాలని మంత్రి కోరారు. ప్రామాణిక జీవన కాలం పూర్తయిన CPE బాక్స్‌లకు ఏప్రిల్ 1 నుంచి రెంటల్ చార్జీలు తగ్గించాలని మంత్రి ఆదేశించారు.

78 నెలలు కాల పరిమితి దాటిన CPE బాక్సులకు రూ. 9 రెంటల్ చార్జీలు.. 60 – 78 నెలల కాల పరిమితి ఉన్న బాక్సులకు రూ. 29.. 60 నెలల లోపు కాలపరిమితి ఉన్న బాక్సులకు రూ. 59 రెంటల్ చెల్లింపులు ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

నెట్‌వర్క్ స్థిరపడే వరకు, పోల్ రెంటల్ చార్జీలపై లోకల్ కేబుల్ ఆపరేటర్ల అభ్యర్థనను పరిశీలించేందుకు విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. APSFL కొత్త CPE బాక్స్‌ల కొనుగోలును దశలవారీగా (batch-wise) ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.

APSFL, NOC, కాల్ సెంటర్ మరియు ఫీల్డ్ స్థాయిలలో కీలక సిబ్బందిని నియమించి కార్యకలాపాలను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. నెట్‌వర్క్ స్థిరత్వం కోసం మెయింటెనెన్స్ (టెక్నికల్ సామగ్రి కొనుగోలు, కాంట్రాక్టులు మొదలైనవి) పనులను అత్యవసరంగా చేపట్టాలని కోరారు.

పంటల (వరి) సాగు ప్రారంభానికి ముందుగా, వేసవి కాలంలో క్షేత్రస్థాయిలో ఫైబర్ నెట్ మరమ్మతు పనులు పూర్తి చేయాలని, ప్రజలకు ఏపీ ఫైబర్ నెట్ ద్వారా మెరుగైన, విస్తృతమైన సేవలు సమగ్రంగా అందించేందుకు నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులకు మంత్రి కోరారు.

ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టీ కృష్ణబాబు, ఏపీ ఫైబర్ నెట్ ఎండి గీతాంజలి శర్మ, ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ సభ్యులు, లోకల్ కేబుల్ ఆపరేటర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

ముగ్గురు అమ్మాయిలు ఆంధ్రా పేరును నిలబెట్టారు!

Satyam News

నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు

Satyam News

బందర్‌ పోర్టుపై వైసీపీ క్రెడిట్‌ చోరీ…. అసలు నిజం ఇది!

Satyam News

దానాలకు శ్రేష్ఠం సంక్రాంతి పండుగ రోజు

Satyam News

కేరళలో ఫీజుల పెంపుపై విద్యార్ధుల నిరసన

Satyam News

ధర్మస్థలిపై తప్పుడు ఆరోపణ చేసిన వ్యక్తి అరెస్టు

Satyam News

Leave a Comment