ముఖ్యంశాలుహోమ్

ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులే ఉపయోగించుకోవాలి

#Narasaraopet

ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు తమ అభివృద్ధికి వినియోగించుకునేలా చూడాలని పల్నాడు జిల్లా జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. డ్వాక్రా రుణాలు వ్యాపారాలకు బదులుగా కుటుంబ అవసరాలకు వినియోగించడం, బాలింతలు మరియు బాలలకు ఇచ్చే పౌష్టికాహారం కుటుంబంలోని అందరూ వినియోగించడం చేయకుండా చూడాలన్నారు.

గ్రామాల్లో ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ గ్రామ హెల్త్ కేర్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. మండలానికి రూ.90 లక్షల చొప్పున గ్రామాల్లో పన్ను వసూళ్లు చేయాలని డీపీవోను ఆదేశించారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బందితో ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలు పూర్తి చేయాలన్నారు. కలెక్టరేట్ లోని ఎస్.ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇంచార్జ్ డిఆర్ఓ నారద ముని, డి.ఎం.హెచ్.వో డాక్టర్. రవి, ఐ.సి.డి.ఎస్ పి.డి, ఎం. ఉమాదేవి, డి.పి.ఓ వి. నాగేశ్వరరావు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వాన్ని నిలదీయండి.. ప్రతిపక్షాన్ని కాదు

Satyam News

పొగాకు ధరపై పచ్చి అబద్దం…. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు

Satyam News

ఐటీ పార్క్ నిర్మించాల్సిన చోట డంప్ యార్డా?

Satyam News

ఆన్ లైన్ బెట్టింగ్ ల కోసం మర్డర్… దారుణం

Satyam News

తెలంగాణ వెలుగులకు సింగరేణి భరోసా

Satyam News

లో ప్రొఫైల్…. హై ఇంపాక్ట్‌…. లోకేష్ వర్కింగ్ స్టయిల్

Satyam News

Leave a Comment