ఆధ్యాత్మికంహోమ్

అంగరంగ వైభవంగా శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణం

గద్వాల పట్టణంలోని కోటలో వెలిసిన శ్రీ భూలక్ష్మి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా శనివారం రాత్రి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ ఉత్సవాలకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని పుట్ట వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు.వారం రోజులపాటు ఈ వేడుకలు మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో 18 ఏళ్ల క్రితం గద్వాల కోటలోని ఆలయ పరిసర ప్రాంతాలు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మంత్రాలయ మఠానికి అప్పగించారు.

గద్వాల పెద్ద జాతరగా పిలువబడే చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలకు గద్వాల చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు కర్ణాటక ప్రాంతానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని కొలుస్తారు. పెద్ద జాతర సందర్భంగా గద్వాల ప్రాంతంలో భక్తుల రద్దీ నెలకొంటుంది.

బ్రహ్మోత్సవాలలో ఫిబ్రవరి 1న అర్ధరాత్రి రథోత్సవం నిర్వహిస్తారు. రథోత్సవ కార్యక్రమానికి, అంతకు ముందు జరిగే పూజా కార్యక్రమాలు మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ శ్రీపాదుల ఆశీస్సులతో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పులిహోర కోట హోమం నిర్వహించారు. లింగంబావిలో తెప్పోత్సవం ఉంటుంది.

Related posts

బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి

Satyam News

పెళ్లిపందిరిపై అమెరికా దాడి: ప్రపంచ దేశాలు ఖండించాలి

Satyam News

బాల రాముడిని కొల్లగొట్టిన వారంతా అరెస్టు

Satyam News

దేశ వ్యాప్తంగా బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కీలక నిర్ణయం

Satyam News

నాగపూర్ లో పేలుడు: 15 మంది మృతి

Satyam News

అన్యాయమైన డిమాండ్లు లేకపోతే చర్చలకు మళ్లీ సిద్ధం

Satyam News

Leave a Comment