ప్రత్యేకంహోమ్

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అపహాస్యం చేస్తున్న బీజేపీ

#RahulGandhi

లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు అధికార బీజేపీ ‘అపహాస్యం’ చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణ చేసింది. భారత్, చైనా సరిహద్దు ఘర్షణ (2020)పై మాజీ సైన్యాధిపతి మనోజ్ నరవణే రాసిన “స్మృతిగ్రంథం (మెమోయర్)” గురించి లోక్‌సభలో మాట్లాడకుండా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అడ్డుకోవడానికి మోదీ ప్రభుత్వం “హెక్లింగ్‌కు” పాల్పడిందని కాంగ్రెస్ సోమవారం ఆరోపించింది.

తమ “అసమర్థతకు సంబంధించిన నిజం బయటపడుతుందన్న భయం” వల్లే ఇలా చేశారని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్ మాట్లాడుతూ, సభలో రాహుల్ గాంధీని “నిశ్శబ్దం చేయడానికి” ప్రభుత్వం సీనియర్ కేబినెట్ మంత్రులను మోహరించిందని, నిబంధనలను “దుర్వినియోగం” చేసిందని విమర్శించారు.

కపట జాతీయ వాదం బయటపడుతుందనే భయం….

“ఈ కపట జాతీయవాద ప్రభుత్వం తమ అసమర్థతకు సంబంధించిన నిజం బయటపడుతుందన్న భయంతో, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడకుండా అడ్డుకోవడానికి సీనియర్ కేబినెట్ మంత్రుల గుంపునే దింపిందని అన్నారు. మాజీ సైన్యాధిపతి జనరల్ మనోజ్ నరవణే  పుస్తక ప్రచురణను అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేసింది.

ఇప్పుడు ఆ పుస్తకం నుంచి వెలువడుతున్న భాగాలు వారి జాతీయవాద బూటకాన్ని బట్టబయలు చేస్తున్నందున, ప్రతిపక్ష నేతను అపహాస్యం చేసి నిశ్శబ్దంగా ఉండేలా చేస్తున్నారు,” అని వేణుగోపాల్ ఎక్స్ (X)లో పోస్టు చేశారు. “ముందు ప్రజా వేదికల్లో భిన్నాభిప్రాయాలను అణిచివేయడం, తర్వాత నిబంధనలను దుర్వినియోగం చేసి ప్రత్యర్థులను మరింత నిశ్శబ్దం చేయడం ఇది 21వ శతాబ్దపు ఫాసిజానికి ఉదాహరణ,” అని వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.

ఈ అంశంపై సోమవారం లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. నరవణే ఇంకా ప్రచురించని “మెమోయర్” నుంచి కోట్ చేయాలని రాహుల్ గాంధీ ప్రయత్నించగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు బీజేపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. రాహుల్ గాంధీ సభను “తప్పుదోవ పట్టిస్తున్నారని” వారు ఆరోపించారు.

ఈ దుమారం కారణంగా సభను రెండు సార్లు వాయిదా వేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై మాట్లాడేందుకు లేచిన రాహుల్ గాంధీ, తనకు ముందు మాట్లాడిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య జాతీయవాదంపై కాంగ్రెస్‌పై చేసిన ఆరోపణలకు ముందుగా స్పందిస్తానని చెప్పారు.

అనంతరం 2020 భారత్–చైనా ఘర్షణపై నరవణే “మెమోయర్”లోని భాగాలను ఉటంకించడం ప్రారంభించారు. అయితే దీనిపై రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. ఆ పుస్తకం ప్రచురితమైందా లేదా అన్న విషయాన్ని ముందుగా స్పష్టంచేయాలని రాహుల్ గాంధీని కోరారు. దీంతో సభలో మరింత గందరగోళం నెలకొంది.

Related posts

వరల్డ్ బైసైకిల్ డే సందర్బంగా సండేస్ ఆన్ సైకిల్

Satyam News

ప్రయివేటు హ్యాకర్లతో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న రేవంత్ రెడ్డి

Satyam News

హోర్మోజ్ జల సంధిని మళ్లీ మూసేసిన ఇరాన్

Satyam News

శ్రీవారికి అష్టలక్ష్మీ చంద్రవంక కంఠి విరాళం

Satyam News

వ్యవసాయ కార్మికులు ఉపాధి కూలీలకు అండగా నిలబడదాం

Satyam News

బ్రెజిల్ లో లిథియం మైనింగ్ కి సింగరేణి

Satyam News

Leave a Comment