జాతీయంహోమ్

అనుకూల తీర్పు రావాలంటే లంచం?

#Cash

అనుకూలంగా తీర్పు వెలువరించేందుకు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తికి లంచం ఇవ్వాలని ఓ సీనియర్ న్యాయవాది పిటిషనర్ వద్ద రూ.50 లక్షలు తీసుకున్నాడంటూ కేంద్ర న్యాయశాఖకు అందిన ఫిర్యాదు న్యాయవర్గాల్లో కలకలం రేపుతోంది.

ఆ ఫిర్యాదును కేంద్ర న్యాయశాఖ మద్రాసు హైకోర్టుకు పంపగా దీన్ని సదరు న్యాయవాది తీవ్రంగా ఖండించారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సదరు కేసు విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

తమిళనాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం వివరాలిలా ఉన్నాయి. 2008-09లో ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పాల్గొంటూ ఇండియన్ మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్‌ను రూ.113.38 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలపై నరేష్ ప్రసాద్ అగర్వాల్, గణేష్ అగర్వాల్‌లపై సీబీఐ కేసు నమోదు చేసింది.

వివిధ పరిణామాల అనంతరం ఈ వ్యవహారంపై విచారణ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.నిర్మల్‌కుమార్ ముందుకు వచ్చింది. అయితే, ఈ కేసులో అనుకూలమైన తీర్పు రావాలంటే న్యాయమూర్తికి రూ.50 లక్షలు ఇవ్వాలంటూ పిటిషనర్ల నుంచి సీనియర్ న్యాయవాది మురళీకుమారన్ తీసుకున్నారని ‘ఆలిండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్’ నుంచి కేంద్ర న్యాయశాఖకు ఫిర్యాదు అందింది.

Related posts

రాయలసీమను తాకిన నైరుతి రుతుపవనాలు

Satyam News

కేరళ రాష్ట్రం పేరును ఎందుకు మారుస్తున్నారో తెలుసా?

Satyam News

సినీ దర్శకుడు డా. పీసీ ఆదిత్య కు పర్యావరణ పురస్కారం

Satyam News

ఏపీలో ఈ హాస్పిటల్… దేశంలో ఎక్కడున్నా వైద్యం

Satyam News

AI సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎం లు

Satyam News

నారా లోకేష్‌ మార్క్ ఎడ్యుకేషన్…కార్పొరేట్ కోటలు బద్దలు.!

Satyam News

Leave a Comment