ముఖ్యంశాలుహోమ్

చేనేత గర్జనతో మార్మోగిన మంగళగిరి

భారతదేశంలో అతిపెద్ద ఉపాధి కల్పన రంగాల్లో ఒకటైన చేనేత రంగాన్ని తక్షణమే ఆదుకోవాలని రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ పిల్లలమర్రి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.చేనేత సహకార సంఘాలకు పెండింగ్ నిధులు తక్షణమే విడుదల చేసి, కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాలని కోరారు.

చేనేత రంగాన్ని కాపాడటం ద్వారా లక్షలాది కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించవచ్చని ఆయన స్పష్టం చేశారు…దశాబ్దాలుగా చేనేత సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో “చేనేత గర్జన” నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ కన్వీనర్ పిల్లలమర్రి నాగేశ్వరరావు తెలిపారు.

ఆదివారం మంగళగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద నుంచి చేనేత కార్మికుల భారీ ప్రదర్శన ప్రారంభమైంది. కనక తప్పట్లతో పాటు చేనేత మగ్గం ప్రదర్శన నిర్వహిస్తూ వేలాదిమంది నేతన్నలు ఐక్యంగా ర్యాలీగా ముందుకు సాగారు.ప్రదర్శన మెయిన్ బజార్, గౌతమ్ బుద్ధ రోడ్డు, ఎన్నారై హాస్పటల్ మీదుగా సాగి నేతన్న సర్కిల్ వరకు చేరుకుంది.

నేతన్న సర్కిల్ వద్ద నేతన్న విగ్రహానికి నూలు దండలు వేసి చేనేత ఐక్యత వర్ధిల్లాలి అంటూ చేనేత రంగ సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికులు నినాదాలు చేస్తూ తమ ఐక్యతను చాటారు..ఇది ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగే సభ కాదని, న్యాయమైన డిమాండ్ల సాధనకై చేనేత హక్కుల కోసం నిర్వహించే కార్యక్రమమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా నేతన్న సర్కిల్ వద్ద జరిగిన సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ పిల్లలమర్రి నాగేశ్వరరావు అధ్యక్షత వహించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత రంగ సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని చేనేత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

కేంద్ర బడ్జెట్ రూ.50 లక్షల 65 వేల కోట్లలో కనీసం రూ.25 వేల కోట్లు చేనేత రంగానికి కేటాయించాలని, రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల 22 వేల కోట్లలో కనీసం రూ.2 వేల కోట్లు కేటాయించి సకాలంలో నిధులు విడుదల చేయాలని కోరారు..చేనేత రంగానికి రూ.115 కోట్లు మాత్రమే కేటాయించడం చిన్నచూపు చూపడమేనని పేర్కొన్నారు.

సహకార సంఘాలకు చెల్లించాల్సిన రూ.203 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం రూ.25 వేల ఆర్థిక సహాయం నేతన్నలందరికీ, చేనేత ఉపవృత్తి కార్మికులకు ఆలస్యం లేకుండా అందించాలని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సహకార సంఘాల రుణాలను రద్దు చేసి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకుల రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని పునరుద్ధరించాలని సూచించారు.1995 హ్యాండ్లూమ్ రిజర్వేషన్ చట్టంలోని 11 రకాల రిజర్వేషన్లను కఠినంగా అమలు చేయాలని, ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.చేనేత వస్త్రోత్పత్తికి వినియోగించే ప్రధాన ముడి సరుకు చిలప నూలుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ చట్టం హ్యాంక్యార్న్ ప్యాకింగ్ నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం నూలు మిల్లులు కనీసం 30 శాతం ప్యాకింగ్ చేయాలని, చేనేత ముడి సరుకులపై విధించిన జీఎస్టీని రద్దు చేసి సబ్సిడీ ధరలకు సరఫరా చేయాలని కోరారు.

రైతుల మాదిరిగా చేనేత వస్త్రాలను ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని, రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపోయిన చేనేతలకు నష్టపరిహారం, నెలకు రూ.10 వేల చొప్పున రెండు నెలల పాటు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

మరణించిన చేనేత కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని పిల్లలమర్రి నాగేశ్వరరావు కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ కో కన్వీనర్లు బండారు ఆనందప్రసాద్, పిల్లలమర్రి బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలు చేనేత వస్త్రాలనే వినియోగించాలని, ప్రతి చేనేత కుటుంబానికి మూడు సెంట్ల భూమి కేటాయించి హౌస్ కమ్ వర్క్ షెడ్లు నిర్మించాలని, అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయాలని వారు సూచించారు.

చేనేత సహకార సంఘాల పాలక మండళ్లకు వెంటనే ఎన్నికలు నిర్వహించి, చేనేతకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, కేంద్ర స్థాయిలో హ్యాండ్లూమ్ బోర్డును పునరుద్ధరించాలని ప్రభుత్వాలను కోరారు.రాష్ట్రవ్యాప్తంగా పలువురు చేనేతలు ఆర్థిక సంక్షోభంతో తీవ్ర స్థితికి చేరుకున్నప్పటికీ ప్రభుత్వాల స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు.గత ప్రభుత్వాలూ ఇదే విధానాన్ని అనుసరించాయని ఆరోపించారు.

ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారం సకాలంలో, అందకపోవడం, బాధాకరమన్నారు. చేనేతల భూముల సమస్యలు, దాడులు వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ వారు చేశారు.ఈ గర్జన ద్వారా చేనేతల సమస్యలను చర్చించి ప్రభుత్వాలకు విన్నవించడమే లక్ష్యమని, పాలకులు చేనేతల దుస్థితిని గమనించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Related posts

వైకుంఠద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు

Satyam News

కల్తీ పాలు తాగి ఇద్దరు మృతి?

Satyam News

శ్రీ‌వారిసేవ‌లో గ్రూప్ సూప‌ర్వైజ‌ర్ల పాత్ర అత్యంత కీల‌క‌మైన‌ది

Satyam News

టీడీపీ నాయకుల్ని బహిష్కరించిన మత్స్యకారులు

Satyam News

పరవాడ లో మళ్లీ గ్యాస్ లీక్

Satyam News

30 వేల మందిని తొలగించనున్న అమెజాన్

Satyam News

Leave a Comment