హైదరాబాద్హోమ్

ఎంపీడీఓలకు వాహనాలు అత్యవసరం: అధ్యక్షురాలు జొన్నల పద్మావతి

గ్రామీణాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే కీలక బాధ్యత ఉన్న ఎంపీడీఓలు వాహనాల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జొన్నల పద్మావతి వెల్లడించారు.

ఆదివారం టీజీఓ భవన్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ ప్రతినిధులు ఈ సమావేశంలో హాజరయ్యారు.ఈ సందర్భంగా జొన్నల పద్మావతి మాట్లాడుతూ, “ఎంపీడీఓలు ప్రభుత్వ పథకాల అమలులో కీలక స్థానంలో ఉంటారు. కానీ వాహన సదుపాయం లేకపోవడంతో మండలాల్లో పర్యవేక్షణ పనులు ప్రభావితమవుతున్నాయి.

వెంటనే ఎంపీడీఓలకు వాహనాలు మంజూరు చేయాలి. పెండింగ్‌లో ఉన్న వాహన బిల్లులన్నీ కూడా విడుదల చేయాలి” అని ప్రభుత్వాన్ని కోరారు.ప్రమోషన్‌కు అర్హత పొందిన ఎంపీడీఓలకు డీపీసి ద్వారా డిప్యూటీ డీఎంఓలుగా పదోన్నతులు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతుండటం సబబుకాదని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ ప్రక్రియను ప్రభుత్వం తక్షణం పూర్తి చేయాలని సంఘం తీర్మానించింది.సర్పంచ్ మరియు ఎంపీటీసీ ఎన్నికలు ఒకేసారి నోటిఫై కావడం నిర్వహణ పరంగా కష్టాలను సృష్టిస్తున్నదని సమావేశంలో నాయకులు పేర్కొన్నారు. కనీసం రెండు ఎన్నికల మధ్య 15 రోజుల విరామం ఉండాలని, ఒక ఎన్నిక పూర్తయ్యాక మరొక ఎన్నిక నిర్వహించాలని తీర్మానించారు.

మండల పరిషత్‌ల పనితీరు కోసం అవసరమైన గ్రాంటులు, సీనియరేజ్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ వంటి నిధులు విడుదల కాకపోవడంతో పనులు మందగిస్తున్నాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిధులను ప్రభుత్వం అత్యవసరంగా విడుదల చేయాలని సమావేశం కోరింది.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎం. మోహన్, అసోసియేట్ అధ్యక్షులు గంగుల సంతోష్ కుమార్, రాష్ట్ర నాయకులు చిరంజీవి, శ్రీనివాస్, కె. రామకృష్ణ, నియాదగిరి, రాజేశ్వర్, శ్రీశివన్ రెడ్డి, ఆర్. రామకృష్ణ, కథలప్ప, విజయ్, వేణుగోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అక్రమ లే-అవుట్లు, నిర్మాణాలపై ఉక్కుపాదం

Satyam News

ఎమిరేట్స్ నుంచి స్పైస్ జెట్ ప్రత్యేక విమానాలు

Satyam News

తెలంగాణలో పోటీకి జనసేన పార్టీ సిద్ధం

Satyam News

శ్రీకాకుళంలో ఒక్క సీటు కూడా వైసీపీకి రాదు: తమ్మినేని

Satyam News

మరింత ప్రభావం చూపించనున్న అల్పపీడనం

Satyam News

గల్ఫ్ యుద్ధ నేపథ్యంలో భారీగా పతనమైన రూపాయి

Satyam News

Leave a Comment