హైదరాబాద్హోమ్

నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

#Revanthreddy

హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మంగళవారం హాజరయ్యారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ, తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో తనపై నమోదైన కేసుల విషయంలో ఆయన నాంపల్లిలోని మనోరంజన్ కోర్టులో వ్యక్తిగతంగా హాజరై విచారణను ఎదుర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహించారన్న ఆరోపణలపై 2016లో రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అలాగే వివిధ కారణాలతో తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్లలో కూడా అప్పట్లో కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన ఈ కేసులను కొట్టివేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తనపై అక్రమంగా కేసులు పెట్టారని పేర్కొంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ కొనసాగుతుండగా, ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ మూడు కేసులకు సంబంధించిన విచారణ పూర్తయినట్లు సమాచారం.

Related posts

వీరబైరాన్‌పల్లి పోరాట ఘట్టం భావితరాలకు స్ఫూర్తి

Satyam News

అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఫతేఖాన్‌పేట పోలీస్ క్వార్టర్స్

Satyam News

జిందాల్ ఎంఎస్ఎమ్ఈ పార్క్ వర్చువల్ ప్రారంభోత్సవానికి సిద్ధం

Satyam News

విధి నిర్వహణలో ఉన్న అధికారిపై కండక్టర్ ‘అటాక్’

Satyam News

మహిళా పోలీస్ స్టేషన్ పై పెట్రోల్ బాటిల్ తో దాడి

Satyam News

ఈ చేతి వాచ్ ఖరీదు రూ.13.7 కోట్లు…..!

Satyam News

Leave a Comment