ముఖ్యంశాలుహోమ్

మై టిడిపి యాప్ వినియోగంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలుగు యువత మరియు ఐటీడీపీ ప్రెసిడెంట్లతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్. జానీ సైదా, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొని, ‘మై టిడిపి’ యాప్ వినియోగంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక రాజకీయాల్లో సాంకేతికత కీలకమని, పార్టీ కేడర్‌ను క్షేత్రస్థాయి నుంచి అనుసంధానించడానికి ఈ యాప్ ఒక వంతెనలా పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త మరియు నాయకుడు ‘మై టిడిపి’ యాప్‌ లో భాగస్వాములు కావాలని, పార్టీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరియు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ముఖ్యంగా తెలుగు యువత మరియు ఐ టీడీపీ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ, సోషల్ మీడియా వేదికగా పార్టీ గళాన్ని వినిపించాలని సూచించారు. గ్రామ స్థాయి నుండి పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సంక్షేమానికి ఈ యాప్ ఎంతో దోహదపడుతుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఐటీడీపీ ప్రతినిధులు, తెలుగు యువత నాయకులు, టీడీపి ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

సిగ్గుపడుతున్న జగన్: ఎందుకో తెలుసా?

Satyam News

రేవంత్ రెడ్డికి ఘాటు లేఖ రాసిన కిషన్ రెడ్డి

Satyam News

ఎల్లంపల్లి నీళ్లకు కాళేశ్వరం నీళ్లుగా ప్రచారం

Satyam News

శాఖమూరులో పొట్టి శ్రీరాముల విగ్రహావిష్కరణ

Satyam News

నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు

Satyam News

అఖండ గోదారిని ఆరాధించేలా పుష్కరాలు

Satyam News

Leave a Comment