హైదరాబాద్హోమ్

ప్రత్యేక ఓటరు సవరణ పట్ల అప్రమత్తంగా ఉండాలి

#Talasani

ప్రత్యేక ఓటరు సవరణ (SIR) కార్యక్రమం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం  బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షత న సనత్ నగర్ నియోజకవర్గ స్థాయి బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన SIR కార్యక్రమంకు సంబంధించిన ఎన్యుమరేటర్ మోడల్ ప్రోపార్మా ను ఆవిష్కరించారు.

బూత్ స్థాయి నాయకులు అప్రమత్తంగా ఉండాలి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ SIR కార్యక్రమం ప్రారంభమైన నాటి నుండి దేశ వ్యాప్తంగా వివిధ రకాల విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమవుతుందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని పార్టీకి చెందిన నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్ లు (BLA) లు జాగ్రత్తతో వ్యవహరించాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మరణించిన ఓటర్లను జాబితా నుండి తొలగించడం 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటరుగా చేర్చడం జరుగుతుందని చెప్పారు. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. సనత్ నగర్ ప్రాంతంలో  వివిధ రాష్ట్రాలు, వివిధ భాషలకు చెందిన వారు వచ్చి స్థిరపడి ఓటర్లుగా నమోదయ్యారని అన్నారు.

సర్వే కార్యక్రమంలో ఓటర్ల పేర్లు తొలగిపోకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ను పార్టీ శ్రేణులు తీసుకోవాలని అన్నారు. కానీ బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) లుగా  GHMC శానిటేషన్ లో స్వీపర్లు, సాంకేతిక పరిజ్ఞానం పై అవగాహన లేని వారిని నియమించడం వలన కొంత గందరగోళం ఏర్పడిందని అన్నారు.

బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా నేనున్నాను…

ఈ నేపథ్యంలో తాను రాష్ట్ర ఎన్నికల కమిషన్, GHMC కమిషనర్ లకు లేఖలు వ్రాయడం, అధికారులతో మాట్లాడి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. బి ఆర్ ఎస్ పార్టీ సభ్యులంతా మా కుటుంబం అని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు  ఎవరికి ఏ అవసరమొచ్చినా, ఏ ఆపద వచ్చిన తాను అండగా నిలబడుతూ వచ్చానని తెలిపారు.

సాధారణ కార్యకర్త కూడా తనను నేరుగా కలిసి తమ సమస్యలను చెప్పుకునే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ కష్టపడి పని చేసే వారికి తగిన గౌరవం, గుర్తింపు తప్పక లభిస్తాయని స్పష్టం చేశారు. జూన్ 1 నుండి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుందని, సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసిన తర్వాత పార్టీ కమిటీల ఏర్పాటు జరుగుతుందని తెలిపారు.

తన 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు కక్ష్య సాధింపు రాజకీయాలకు పాల్పడలేదని, పార్టీ శ్రేణులకు కూడా ప్రోత్సహించలేదని నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం కోసమే పని చేశామని అన్నారు. 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం లో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి చేశామని అన్నారు.

మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది…

మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని అన్నారు. ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ రాష్ట్రం ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెందిందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు పంటలకు విద్యుత్, సాగు నీరు ఉండేది కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా ను చూసి దేశం ఆశ్చర్య పోయిందని అన్నారు. తెలంగాణ సెక్రెటరీయేట్, 125 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత బి ఆర్ అంబేద్కర్ విగ్రహాలు కేసీఆర్ ప్రభుత్వం లో అద్భుత నిర్మాణాలు అని వివరించారు.

పేద ప్రజలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది అని పేర్కొన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల గౌరవాన్ని పెంచే విధంగా కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా అభివృద్ధి లో అగ్రస్థానంలో నిలిపిందని చెప్పారు.

బూతులు ఎక్కువ మాట్లాడుతున్న తెలంగాణ సీఎం

కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమి లేదు కానీ ముఖ్యమంత్రి బూతు మాటలు అధికంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి నోరు పారేసుకుంటుంటే కొడుకుగా కేటీఆర్ స్పందిస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు.

రెండున్నర సంవత్సరాల తర్వాత వచ్చేది బి ఆర్ ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, కొలన్ లక్ష్మీ, అత్తిలి అరుణ గౌడ్, టి. మహేశ్వరి, ఆకుల రూప, డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, కొలన్ బాల్ రెడ్డి, గుర్రం పవన్ కుమార్ గౌడ్, ఆకుల హరికృష్ణ,  శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు, పలువురు పార్టీ నాయకులు, 229 బూత్ ల ఏజెంట్ లు పాల్గొన్నారు.

Related posts

సుభాష్ నేరాన్ని సమర్థించే వారు ఇది తెలుసుకోవాలి….

Satyam News

జగన్ సైతాన్ సైన్యం పై షర్మిల సంచలన ఆరోపణ

Satyam News

చేనేత గర్జనతో మార్మోగిన మంగళగిరి

Satyam News

దొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఐలమ్మ

Satyam News

ఇరాన్ పై యుద్ధంలో భారత్ రాయబారం?

Satyam News

డిజిటల్ అరెస్టు మోసాలకు రూ.54 వేల కోట్లు హాంఫట్

Satyam News

Leave a Comment