చిత్తూరుహోమ్

నెయ్యి ట్యాంకర్ బోల్తా: ప్రమాదమా? కుట్రా?

#MilkTankar

పుణె నుంచి తిరుమలకు నెయ్యి లోడుతో వెళ్తున్న ట్యాంకర్ వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురం మండలం చిత్రావతి వంతెన సమీపంలో బోల్తా పడింది. దీంతో ట్యాంకర్‌లోని నెయ్యి నేలపాలైంది. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని బిందెలు, బకెట్లు, బాటిళ్లతో నెయ్యి కోసం ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నెయ్యిని తీసుకెళ్లకుండా నియంత్రించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

వెనువెంటనే కరుణాకర్ రెడ్డి మైకు ముందు వాలారు. తిరుమలకు 21,000 కిలోల నెయ్యిని తీసుకువెళ్తున్న ట్యాంకర్ ఇందాపూర్ సమీపంలో బోల్తా పడిందని, ప్రస్తుతం కొండపై నెయ్యి నిల్వలు కేవలం 3,500 కిలోలు మాత్రమే ఉన్నాయని, ఇది మరో రెండు రోజులకు కూడా సరిపోదని ఆయన పేర్కొన్నారు. తిరుమల వంటి పవిత్ర పుణ్యక్షేత్రం పట్ల అధికారులు మరియు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఈ సంఘటన నిదర్శనమని విమర్శించారు.

మరోవైపు శ్రీవారి లడ్డూల తయారీలో వాడే నెయ్యి నిల్వలకు కొరత లేదని టీటీడీ స్పష్టం చేసింది. అసత్య ప్రచారాలు నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేస్తూ, టీటీడీ వద్ద నెయ్యి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపింది. మూడంచెల కొనుగోలు విధానం ద్వారా ఆవునెయ్యి సరఫరా జరుగుతోందని, ప్రస్తుతం 7 లక్షల లడ్డూలు అందుబాటులో ఉన్నాయని వివరించింది.

పరకామణి కేసులో ఫిర్యాదు చేసిన నాటి విజిలెన్స్ సీఐ రవి కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని, విచారణ పేరుతో పిలవడం వలనే అది జరిగిందని, పోస్టుమార్టం నివేదిక కూడా రాకముందే కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. అయితే తరువాత అది ఆత్మహత్య కాదని తేలిన విషయం మనకు తెలిసిందే.

దేనికైనా తెగించే ఈ కల్తీ క్రిమినల్ ముఠా మాటలు తేడాగా వున్నాయి. దయచేసి ఇది ప్రమాదమా లేదా ఏదైనా కుట్రా అనే కోణంలో విచారించాలి. అలాగే లడ్డూ నెయ్యి నిల్వలపై అబద్ధాలు చెబుతూ భక్తులను ఆందోళనకు గురిచేస్తున్న ఈ కరుణాకర్ రెడ్డి మీద టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

Related posts

ప్ర‌ముఖ న్యాయ‌వాది కోల‌గ‌ట్ల త‌మ్మ‌న్నశెట్టి ఆత్మహత్య

Satyam News

ట్రంప్ మరో సాహసం: డాలర్ పై సంతకం

Satyam News

అంతర్జాతీయ డేటా గేట్ వే గా వైజాగ్

Satyam News

పల్నాడులో రూ.3,312 కోట్ల రుణాల పంపిణీ

Satyam News

జగన్ సైతాన్ సైన్యం పై షర్మిల సంచలన ఆరోపణ

Satyam News

విజయవంతంగా తొలి రోజు ఆర్టీసీ సమ్మె

Satyam News

Leave a Comment