గుంటూరుహోమ్

క్రెడిట్ ఎవరిదో… క్రెడిబులిటీ ఎవరికుందో ప్రజలకు తెలుసు

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి… ఇప్పుడు ఆ క్రెడిట్‌ను దక్కించుకునేందుకు కొందరు తయారయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత కొంత కాలంగా క్రెడిట్ చోరీ అంటూ చేస్తున్న విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…”కుట్రలు కుతంత్రాలు రాజకీయాల్లో చేస్తూనే ఉంటారు. వాటిని ఎదుర్కోవడానికి… దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి నేతలు, కార్యకర్తలు సిద్దంగా ఉండాలి. 18 నెలల్లో రకరకాల కుట్రలు పన్నారు. వైసీపీ పుట్టుకే ఫేక్..ఒక పార్టీ అవినీతి సొమ్ముతో పేపరు పెట్టుకుంది.

అటువంటి పార్టీతో పోరాడాల్సి రావడం దౌర్బాగ్యం. క్రెడిట్ చోరీ అని కొన్ని వార్తలు రాస్తున్నారు. అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారు. కాకినాడలో ఏఎమ్ గ్రీన్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోంది. అందులో తామే ఏదో చేసేశామని క్రెడిట్ దక్కించుకునే ప్రయత్నం చేయడమే కాకుండా… మనపై క్రెడిట్ చోరీ అని రాస్తున్నారు. ఇదే కాకుండా… చాలా విషయాల్లో ఇలాగే వ్యవహరిస్తున్నారు.

కియాతో సంబంధం లేకున్నా… ఆ పరిశ్రమను కూడా తామే తెచ్చామని గతంలో చెప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ అలాంటి బాగోతమే మొదలు పెట్టారు. భోగాపురం విమానశ్రయానికి 2,500 ఎకరాలు భూ సేకరణ మనమే చేశాం. ఎప్పుడో అయిపోవాల్సిన ప్రాజెక్టును 5 ఏళ్ల పాటు మూలన పడేశారు.

మొదటిసారి సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని కూడా తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. మనం చేసిన పనులకు వాళ్లు క్రెడిట్ చోరీ చేస్తూ… తిరిగి మన పైనే క్రెడిట్ చోరీ అని దుష్ప్రచారం చేస్తున్నారు. క్రెడిట్ చోరీ అని వాళ్లు గింజుకున్నా, సైబరాబాద్, కియా, గూగుల్, భోగాపురం, గ్రీన్ ఎనర్జీ వంటి వన్నీ తెలుగుదేశం పార్టీలో తెచ్చినవే.

వాళ్లకు వేరే అంశాల్లో క్రెడిట్ ఉంది… శాండ్, వైన్, మైన్, డ్రగ్స్, గంజాయితో దోపిడీ… ఇదీ వాళ్ల క్రెడిట్. భూములను లాక్కొడవం వాళ్ల క్రెడిట్. ప్రజల ఆస్తులపై వాళ్ల ఫొటోలు వేసుకోవడం వాళ్ల క్రెడిట్. సర్వే రాళ్లపై రూ.700 కోట్లు ఖర్చు చేసి బొమ్మలు వేసుకోవడం వాళ్ల క్రెడిట్. ఉద్యోగులను ఇబ్బందులు పెట్టడం వాళ్ల క్రెడిట్. పిన్నమ్మ తాళ్లు తెంచిన నేరస్తులను కాపాడుతున్న పార్టీని ఏమనాలి.? వారు కూడా మనల్ని విమర్శిస్తున్నారు.”అని చంద్రబాబు మండిపడ్డారు.

Related posts

తదుపరి సీఎస్ ఎవరు?

Satyam News

ఒక్క ప్రాజెక్టు..లక్ష ఉద్యోగాలు..లోకేష్ సంచలనం.!

Satyam News

మహిళా భద్రతకు “సహచరి”

Satyam News

ఉక్రెయిన్ తో యుద్ధం ఆపకుంటే తీవ్ర పరిణామాలు

Satyam News

మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్న ఎమ్మెల్యే కృష్ణారావు

Satyam News

భారత్‌ కు పాకిస్తాన్ రక్షణ మంత్రి హెచ్చరిక

Satyam News

Leave a Comment