హైదరాబాద్హోమ్

సమ్మెలో పాల్గొన్న 4 లక్షల మంది గిగ్ వర్కర్లు

#GigWorkers

డిమాండ్ల సాధన కోసం గిగ్ వర్కర్లు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మె విజయవంతం అయింది. తెలంగాణ యాప్‌ ఆధారిత డ్రైవర్ల ఫోరం (టీఏడీఎఫ్), తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) సంయుక్తంగా ఇచ్చిన పిలుపుతో సుమారు 3.90 లక్షల మంది గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సమ్మెలో ఓలా, ఉబెర్, రాపిడోకు చెందిన క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, సరుకు రవాణా ఆటో డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, పోర్టర్ తదితర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన డెలివరీ సిబ్బంది, ఇతర గిగ్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తమ డిమాండ్లకు మద్దతుగా సేవలను తాత్కాలికంగా నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు.

ఈ ఉద్యమానికి పలు కార్మిక సంఘాలు, కార్మిక హక్కుల సంస్థలు, ప్రజాస్వామ్య వేదికలు పూర్తి సంఘీభావం ప్రకటించాయి. ప్రభుత్వం, డిజిటల్ ప్లాట్‌ఫామ్ సంస్థలు తమ న్యాయమైన, దీర్ఘకాలిక డిమాండ్లను పట్టించుకోకపోతే 2026 ఆగస్టు 8 తర్వాత నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు కార్మిక సంఘాలు హెచ్చరించాయి.

గిగ్ కార్మికులు తమ ప్రధాన డిమాండ్లలో భాగంగా యాప్‌ ఆధారిత రవాణా సేవలకు కనీస ప్రాథమిక ఛార్జీని నిర్ణయించాలని, ప్రతి కిలోమీటర్, ప్రతి నిమిషానికి న్యాయమైన చెల్లింపు విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. అలాగే తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ నిబంధనలను వెంటనే అమల్లోకి తీసుకువచ్చి గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అదేవిధంగా మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలు–2025 ప్రకారం కనీస ఛార్జీలను ప్రభుత్వం అమలు చేయాలని, ప్రస్తుతం అగ్రిగేటర్ సంస్థలు ఏకపక్షంగా ఛార్జీలు, కమిషన్లు నిర్ణయించే విధానానికి ముగింపు పలకాలని కార్మికులు కోరుతున్నారు. తమ జీవనోపాధిని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సమస్యలకు పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related posts

చరిత్ర సృష్టిస్తున్న మిడ్ ఫీల్డర్ రుతుజ

Satyam News

చెరువు నీళ్లు కూడా అమ్ముకున్న పిన్నెల్లి

Satyam News

పెరిగిన ప్రీమియర్ పెట్రోలు ధరలు

Satyam News

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాల నిర్వహణ

Satyam News

అక్రమ వలసలపై అధ్యయన కమిటీ ఏర్పాటు

Satyam News

కల్తీ పాల మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

Satyam News

Leave a Comment