ప్రత్యేకంహోమ్

ప్రధాని మోడీతో చంద్రబాబు సుదీర్ఘ భేటీ

#Modi

దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు సుదీర్ఘంగా సమావేశం కావడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఒక వైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటం, మరో వైపు కాంగ్రెస్, కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కి ఉంది. ఈ దశలో చంద్రబాబునాయుడితో సుదీర్ఘంగా దాదాపు అరగంట సేపు ప్రధాని మోడీ చర్చించడం ఆసక్తి రేకెత్తిస్తున్నది.

ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర-రాష్ట్ర సమన్వయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.

ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో నిర్మాణం పూర్తికి చేరువలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అధికారికంగా ఆహ్వానించారు. ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ప్రధాని, ఆగస్టు 1న నిర్వహించనున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని, కార్యక్రమానికి వచ్చేలా తన బృందం ఏర్పాట్లు చేస్తుందని తెలిపినట్లు సమాచారం.

సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులను ప్రధానమంత్రికి చంద్రబాబు పరిచయం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడిని పరిచయం చేయగా, ప్రధాని మోదీ వెంటనే స్పందిస్తూ “అప్పలనాయుడు నాకు తెలుసు. ఆయన ప్రతిరోజూ సైకిల్‌పై పార్లమెంటుకు వస్తుంటారు” అని వ్యాఖ్యానించినట్లు అక్కడ ఉన్న నాయకులు తెలిపారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్య సమావేశంలో ఆహ్లాదకర వాతావరణాన్ని తీసుకొచ్చినట్లు సమాచారం.

రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి మరింత సహకారం అందించే అంశంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి హాజరైతే రాష్ట్ర విమానయాన రంగానికి మరింత ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Related posts

ఎల్ నినో ప్రభావం తో ఈసారి కష్ట కాలమే

Satyam News

అంతరించిపోతున్న నాటక రంగానికి ఊపిరి

Satyam News

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దాడి వెనుక పిన్నెల్లి సోదరులు?

Satyam News

థాయ్‌లాండ్–హైదరాబాద్ డ్రగ్స్ లింక్ బట్టబయలు

Satyam News

రవీంద్ర భారతిలో ఘనంగా బసవేశ్వర 893వ జయంతి

Satyam News

కోటప్పకొండ తిరునాళ్ళు సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు

Satyam News

Leave a Comment