ప్రత్యేకంహోమ్

వారితో పోటీ పడటం కష్టంగా ఉంది…..

#NaraLokesh

సీఎం చంద్రబాబు నాయుడుకి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తన ఇంట్లో వారితో పోటీ పడడం కష్టంగా మారిందంటూ లోకేష్ ట్వీట్ చేశారు. తండ్రి చంద్రబాబు నాయుడు, తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణి, కొడుకు నారా దేవాన్ష్ అందరూ ఏదో ఓ రంగంలో రాణిస్తూ దూసుకెళ్తున్నారని, వారితో పోటీ పడడం కష్టంగా మారిందంటూ లోకేష్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం నారా వారింటికి అవార్డులు క్యూ కడుతున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబునాయుడుకు ప్రముఖ వాణిజ్య దినపత్రిక ది ఎకనామిక్స్‌ టైమ్స్‌ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటించింది. ఇటీవల నారా భువనేశ్వరిసైతం గోల్డెన్ పికాక్ అవార్డు అందుకున్నారు. హెరిటేజ్‌ నిర్వహణలో చూపిన ప్రతిభకు గోల్డెన్ పికాక్…NTR ట్రస్ట్‌ ద్వారా చేస్తున్న సామాజిక సేవకు గానూ ఫెలోషిప్..ఇలా రెండు ప్రతిష్టాత్మక అవార్డులను భువనేశ్వరి లండన్‌లో అందుకున్నారు.

ఇక, జాతీయ స్థాయిలో బిజినెస్‌ రంగంలో అత్యంత శక్తివంతమైన లోకేష్ సతీమణి, నారా బ్రాహ్మణి స్థానం సంపాదించారు. ఇక లోకేష్ కుమారుడు దేవాన్ష్‌ చెస్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే లోకేష్‌ సరదా ట్వీట్ చేశారు.  ఇంట్లో చంద్రబాబు నుంచి దేవాన్ష్ వరకు తరాల మధ్య పోటీ జరుగుతోందన్నారు.

తన కుటుంబం పట్ల లోకేష్‌కున్న గౌరవం, వారి విజయాల పట్ల ఉన్న గర్వం ఈ ట్వీట్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల స్ఫూర్తితో, ప్రజాక్షేత్రంలో మరింత కష్టపడి, ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించడమే తనకు నిజమైన అవార్డుగా లోకేష్ భావిస్తున్నారు. మొత్తానికి నారా వారింట జరుగుతున్న ఈ  అవార్డుల సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ అయ్యింది.

Related posts

సీఎం సారూ…. నన్ను బతికించండి..: కీర్తన

Satyam News

చరిత్రలో అతి పెద్ద చమురు ఒప్పందం కుదుర్చుకున్న ట్రంప్

Satyam News

ఇదేనా మీరు చెప్పే అంతర్జాతీయ ప్రమాణాలు రేవంత్ రెడ్డి?

Satyam News

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Satyam News

అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఫతేఖాన్‌పేట పోలీస్ క్వార్టర్స్

Satyam News

ఆటోగ్యాస్ కొరతను అధిగమించడానికి ప్రజా రవాణా సేవల విస్తరణ

Satyam News

Leave a Comment