ఖమ్మంహోమ్

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ

#Tummala

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సదుపాయాలు, పరిశుభ్రత, ఔషధాల లభ్యత తదితర అంశాలపై ఆయన సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని వైద్య అధికారులు, సిబ్బందికి స్పష్టం చేశారు.

ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించేలా సేవల ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు.

అనంతరం ప్రత్యేక ఓటరు సర్వే కార్యక్రమం (ఎస్‌ఐఆర్)లో భాగంగా ఖమ్మం నియోజకవర్గంలోని వీడీవో కాలనీలో జరుగుతున్న ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను మంత్రి పరిశీలించారు. కార్యక్రమం పురోగతి, నిర్వహణ తీరుపై అధికారులతో చర్చించి అవసరమైన సూచనలు చేశారు.

Related posts

తెలంగాణ పోలీసులకు సీఎం రేవంత్ అభినందన

Satyam News

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ప్రభావం ఏ మేరకు?

Satyam News

కేంద్ర ప్రతినిధి బృందంతో చంద్రబాబు భేటీ

Satyam News

కేసీఆర్ పూజ గదిలో ఏముందో తెలిస్తే……

Satyam News

జగన్ చేసిన తప్పులే ప్రజలకు శాపాలు

Satyam News

ముడి చమురు ధరలతో మార్కెట్లు పతనం

Satyam News

Leave a Comment