హైదరాబాద్హోమ్

రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్

#Revanthreddy

రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈనెల 20వ తేదీన (ఎల్లుండి) రెండో విడుత నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్​ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఈ పథకం కింద ప్రభుత్వం రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తోంది. ఎకరానికి రూ. 6 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. 20వ తేదీన భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సమక్షంలో ఈ నిధులు విడుదల చేస్తారు. తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులున్నారు.

వీరందరికీ గత నెల 23వ తేదీన మొదటి విడుత రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రతి రైతుకు ఒక ఎకరానికి సరిపడే పెట్టుబడి సాయం ముందుగా విడుదల చేసింది. దాదాపు రూ.3,590 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. రెండో విడుతలో 45,11,947 మంది రైతులు రైతు భరోసా సాయం అందుకుంటారు. దీంతో రూ.5653 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. రెండో విడత నిధుల పంపిణీ అనంతం, మూడో విడత నిధులను వీలైనంత తొందరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

Related posts

ఆత్మహత్య నుంచి మహిళను రక్షించిన పోలీసులు

Satyam News

రామడుగులో శాశ్వత విద్యుత్ లైన్ వీధి దీపాల ఏర్పాటు

Satyam News

ప్రకృతి వ్యవసాయ నమూనాలకు నెదర్లాండ్స్ ప్రశంసలు

Satyam News

అమెరికాకు గట్టిగా బుద్ధి చెప్పనున్న భారత్

Satyam News

చేనేత గర్జనతో మార్మోగిన మంగళగిరి

Satyam News

ఇరాన్ లొంగిపోవాల్సిందే: ట్రంప్ హెచ్చరిక

Satyam News

Leave a Comment