ప్రత్యేకంహోమ్

నటి ట్విషా శర్మ కేసును స్వీకరించిన సుప్రీంకోర్టు

#TwishaSharma

మాజీ మోడల్‌, నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో నిష్పక్షపాత, స్వతంత్ర దర్యాప్తు జరుగుతుందని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థ నిందితులను కాపాడుతోందన్న ప్రచారం తమను బాధించిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని తెలిపింది.

ముప్పై మూడు సంవత్సరాల ట్విషా శర్మ మే 12వ తేదీనభోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలోని అత్తింట్లో ఉరివేసుకుని మృతిచెందిన స్థితిలో కనిపించింది. ఆమె కుటుంబ సభ్యులు కట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ భర్త సమర్థ్ సింగ్‌, అత్త గిరిబాలా సింగ్‌ లపై ఆరోపణలు చేశారు. సమర్థ్ సింగ్ న్యాయవాది కాగా, గిరిబాలా సింగ్ మాజీ జిల్లా న్యాయమూర్తి. అయితే ట్విషా మాదకద్రవ్యాల వ్యసనానికి అలవాటు పడిందని అత్తింటి వారు చెబుతున్నారు.

ఈ వ్యవహారంపై పోలీసులు కట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపణ కేసులు నమోదు చేశారు. దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మీడియాలో కథనాలు వచ్చాయి. నిందితులు అందరూ న్యాయ వ్యవస్థకు చెందిన వారు కావడం వల్లే విచారణ లో కూడా పక్షపాత ధోరణి కనిపిస్తున్నదని ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు స్వయంగా విచారణ ప్రారంభించింది.

ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌, న్యాయమూర్తి జాయ్‌మాల్య బాగ్చి ధర్మాసనం కేసు విచారణ చేస్తూ మీడియా సంయమనం పాటించాలని సూచించింది. బాధిత కుటుంబం లేదా మరో కుటుంబం చేసే ప్రకటనలను ప్రసారం చేయొద్దని కోరింది. బాధను మీడియా కథనాలుగా మార్చవద్దని వ్యాఖ్యానించింది. కేసుపై ముందస్తు కథనాలు దర్యాప్తును ప్రభావితం చేయవచ్చని హెచ్చరించింది.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ స్వీకరిస్తుందని, అవసరమైన పరిపాలనా చర్యలు అదే రోజు పూర్తి చేస్తామని తెలిపారు. ట్విషా అత్తగారు టెలివిజన్ చానళ్లలో మాట్లాడటం వల్లే కేసు మరింత ప్రచారంలోకి వచ్చిందని చెప్పారు. మీడియా జోక్యంతోనే కేసులో గణనీయ పురోగతి సాధ్యమైందన్నారు.

ట్విషా మృతదేహానికి మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు భోపాల్ వైద్య విజ్ఞాన సంస్థ వైద్య బృందం ఆదివారం రెండోసారి శవ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు.

నిందితుల తరఫున హాజరైన న్యాయవాది సిద్ధార్థ్ దవే మాట్లాడుతూ, మీడియా విచారణలా వ్యవహరిస్తోందని, మేజిస్ట్రేట్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలం పూర్తిగా పత్రికల్లో ప్రచురించబడిందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

దర్యాప్తు ప్రభావితం కాకుండా బాధితులు, నిందితుల కుటుంబాలు మీడియా ముందుకు రావొద్దని సుప్రీంకోర్టు సూచించింది. తమ వాదనలు దర్యాప్తు సంస్థ ఎదుటే ఉంచాలని తెలిపింది. ప్రజలు ఊహాగానాలకు తావివ్వకుండా దేశంలోని ప్రముఖ దర్యాప్తు సంస్థపై విశ్వాసం ఉంచాలని ధర్మాసనం పేర్కొంది.

Related posts

జూన్ 2న ఆదిలాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం

Satyam News

ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ “అమ్ములు”కు అనూహ్య స్పందన

Satyam News

ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణ మహోత్సవం

Satyam News

అసైన్మెంట్ భూములకు రక్షణ కల్పించాలి

Satyam News

కరాచీ లో అమెరికా కాన్సులేట్ పై దాడి: 20 మంది మృతి

Satyam News

వరల్డ్ బైసైకిల్ డే సందర్బంగా సండేస్ ఆన్ సైకిల్

Satyam News

Leave a Comment