ముఖ్యంశాలుహోమ్

ముద్రగడ పద్మనాభంను పరామర్శించిన సజ్జల

#MudragadaPadmanabham

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభంని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌లో పరామర్శించారు.

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రికి వెళ్లిన సజ్జల రామకృష్ణారెడ్డి, గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ముద్రగడ పద్మనాభం ని కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను తెలుసుకుని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం కుమారుడు, ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ ముద్రగడ గిరిబాబు, కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయని వారికి భరోసా కల్పించారు.

ముద్రగడ పద్మనాభం పూర్తిగా కోలుకుని త్వరలోనే ప్రజల మధ్యకు రావాలని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అలాగే ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా జీవితంలో చురుకుగా కొనసాగాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఆకాంక్షించారు.

Related posts

తల్లి పాలలో ప్రమాదకర యురేనియం..?

Satyam News

ముగ్గురు అక్కాచెల్లెళ్లు…. ఒకే మొగుడు…. వీడియో వైరల్

Satyam News

దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు

Satyam News

నన్ను తీవ్రంగా అవమానిస్తున్నారు: కొండా సురేఖ

Satyam News

జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులు

Satyam News

ఈ చేతి వాచ్ ఖరీదు రూ.13.7 కోట్లు…..!

Satyam News

Leave a Comment