కృష్ణహోమ్

విజయవాడలో ఘనంగా ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా, మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, అకాడమీ నూతన చేర్మెన్ ముహమ్మద్ ఫారూక్ షుబ్లీ అధ్యక్షతన, ‘సురూర్-ఎ-ఉర్దూ మహోత్సవ్’ కార్యక్రమాన్ని, అత్యంత వైభవంగా 29-12-2025 (సోమవారం) తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది.

ఈ సాంస్కృతిక వేడుకలకు ముఖ్య అతిథులుగా న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జనాబ్ ఎన్.ఎండి. ఫరూక్, ప్రభుత్వ సలహాదారులు జనాబ్ ముహమ్మద్ అహ్మద్ షరీఫ్ విచ్చేయనున్నారు. విశిష్ట అతిథిగా మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి సీహెచ్ శ్రీధర్ పాల్గొంటారు.

అలాగే, గౌరవ అతిథులుగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని), శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర రావు (విజయవాడ సెంట్రల్), సుజనా చౌదరి (విజయవాడ పశ్చిమ), గద్దె రామ్మోహన్ రావు (విజయవాడ తూర్పు), బోడే ప్రసాద్ (పెనమలూరు) పాల్గొననున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉర్దూ భాషా సౌరభాన్ని, సంస్కృతిని చాటిచెప్పే ఈ మహోత్సవానికి ఉర్దూ భాషాభిమానులు, శ్రేయోభిలాషులు మరియు ప్రజలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది.

Related posts

తీర్పుల జాప్యం పై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

Satyam News

వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేసిన గత వైసిపి ప్రభుత్వం

Satyam News

రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి

Satyam News

భారత్ సముద్ర తీరం వద్దకు వచ్చిన ‘యుద్ధం’

Satyam News

తిరుమల ల్యాబ్ పై రాజకీయం మొదలెట్టిన వైసీపీ

Satyam News

హెడ్ కానిస్టేబుల్ కు అండగా నిలిచిన పోలీసు శాఖ

Satyam News

Leave a Comment