గుంటూరుహోమ్

వేసవిలో నీటి ఎద్దడి రానీయకుండా చెరువులు నింపాలి

రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పల్నాడు జిల్లా నరసరావుపేట పురపాలక సంఘ పరిధిలోని ఏ వార్డులోనూ తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటమే మన ప్రాధాన్యత అని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు.

పట్టణ ప్రజల అవసరాల నిమిత్తం ముందస్తు చర్యగా చెరువులను పూర్తిస్థాయిలో నింపాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే మున్సిపల్ డిఈతో కలిసి నగరికల్లు సమీపంలోని నకరికల్లు చెరువు, శాంతి నగర్ వద్ద ఉన్న చెరువులను, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను కూడా పరిశీలించారు.

పూర్తిస్థాయిలో నీటి సామర్థ్యాన్ని నింపి ఆగస్టు వరకు పట్టణ ప్రజలకు రెండు పుట్ల నీటిని అందిస్తామని తెలియజేశారు. ఎక్కడా సాంకేతిక లోపాలు తలెత్తకుండా, పంపింగ్ వ్యవస్థను సిద్ధం చేసి నీటి నిల్వలను పెంచాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసిరెడ్డి రవి, మడక ప్రసాద్, వేముల పాండు , మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Related posts

విద్యార్థుల భవిష్యత్‌ తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

Satyam News

ట్రంప్ నిర్ణయానికి ఎదురుతిరిగిన ఆ ముగ్గురు….

Satyam News

యశోద హాస్పిటల్స్ లో అత్యాధునిక “పల్స్ ఫీల్డ్ అబ్లేషన్” (PFA)

Satyam News

ఆ ఒక్క నిర్ణయం క్రికెట్ గతిని మార్చింది…

Satyam News

అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ , పీ.జీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభం

Satyam News

వల్లభనేని వంశీపై మరో కేసు..మళ్లీ అరెస్టు..?

Satyam News

Leave a Comment