విశాఖపట్నం హోమ్

CII సమ్మిట్ గ్రాండ్ సక్సెస్‌..బాబు, లోకేష్‌ సూపర్‌..

#CII

విశాఖ వేదికగా నిర్వహించిన CII – AP పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ గ్రాండ్‌ సక్సెస్ అయింది. 3 రోజుల్లోనే 613 ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా 12 సెక్టార్లలో 13.26 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల 31 వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.

పారిశ్రామికవేత్తలకు రెడ్‌కార్పెట్ పరిచిన ఏపీ ప్రభుత్వం..రాష్ట్రంలో ఉన్న వనరులు, మౌలికసదుపాయాలపై అద్భుతంగా వివరించింది. దీంతో ఏపీ ప్రభుత్వ విధానాలపై పారిశ్రామికవేత్తలు నమ్మకం ఉంచారు. లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలపై సంతకాలు చేశారు. 14, 15 తేదీల్లో భాగస్వామ్య సదస్సు అని ప్రకటించినా..ఒకరోజు ముందే నగరంలో పెట్టుబడుల సందడి మొదలైంది.

జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక ప్రతినిధులతో విశాఖ ఓ మినీ ప్రపంచాన్ని తలపించింది. 16 నెలల క్రితం ఏపీ అంటేనే భయపడి, ఇక్కడ ఉన్నవాళ్లు రాష్ట్రాన్ని వదిలిపోయిన స్థితి నుంచి పెట్టుబడులు అంటేనే ఏపీ అన్నంతగా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఏపీకి ఇండస్ట్రీయలిస్ట్‌లు క్యూ కడుతున్నారు. గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు తర్వాత..అదే రంగంలో పెట్టుబడులు పెడతామంటూ దిగ్గజ సంస్థలు విశాఖకు వచ్చాయి.

రిలయన్స్, బ్రూక్‌ఫీల్డ్‌ సంస్థలు 1,000 మెగావాట్ల చొప్పున డేటా సెంటర్ల ఏర్పాటుకు వేర్వేరుగా ఒప్పందాలు చేసుకున్నాయి. పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నింపేందుకు.. చంద్రబాబు కీలక నిర్ణయాలు ప్రకటించారు. వచ్చే ఏడాది మళ్లీ నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలోనే సదస్సు నిర్వహిస్తామని, దీనికోసం ప్రత్యేకంగా విశాఖ తీరాన  ఆంధ్ర మండపం ఏర్పాటు చేస్తామన్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే పని మొదలుపెట్టింది. చంద్రబాబు, మరోవైపు లోకేష్‌ ఆ బాధ్యతను భుజాలపైకి ఎత్తుకున్నారు. పారిశ్రామికవేత్తల్లో భరోసా కల్పించే చర్యలు చేపట్టారు. 15 రోజులకోసారి  పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశాలు నిర్వహించి, పెద్దఎత్తున అనుమతులిచ్చారు. ఆ వెంటనే మంత్రివర్గ సమావేశాలు నిర్వహించి ఆమోదం తెలిపారు.

తక్షణమే ఉత్తర్వులు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సు నాటికే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. భాగస్వామ్య సదస్సు సందర్భంగా సుమారు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే అంతకు మించిన స్పందన లభించింది.

సుమారు రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఇది అంచనాకంటే 30% అదనం. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, పారిశ్రామికవేత్తలు విశాఖకు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ను తిరిగి తెచ్చిపెట్టడం, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడమే లక్ష్యంగా..సదస్సుకు 2 నెలల ముందు నుంచే చంద్రబాబు, లోకేశ్‌ ఫోకస్‌ పెట్టారు.

చంద్రబాబు సింగపూర్,UAE, లండన్‌ సహా వివిధ దేశాలకు వెళ్లి రోడ్‌షోలు నిర్వహించి ప్రమోషన్‌ చేశారు. మంత్రి లోకేశ్‌ అమెరికా, ఆస్ట్రేలియాలో పర్యటించి, పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దీంతో పెద్దఎత్తున పారిశ్రామికవేత్తలు సదస్సుకు తరలివచ్చారు.

లోకేష్‌ ప్రత్యేక శ్రద్ధ

దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా మంత్రి లోకేశ్‌ తీవ్రంగా శ్రమించారు. సంస్థల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ.. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారికి వివరించారు. ఆరేళ్ల కిందట రాష్ట్రాన్ని వదిలిన సంస్థలకూ తామున్నామని భరోసా ఇచ్చారు.

దీంతో రూ.2.50 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఏపీ తలుపు తట్టాయి. బ్రూక్‌ఫీల్డ్‌ సంస్థ రూ.1.06 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. రెన్యూపవర్‌ రూ.82 వేల కోట్లు, ఎస్‌ఏఈఎల్‌ రూ.22 వేల కోట్లు, హిందూజ రూ.20 వేల కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్నాయి.

Related posts

విజయవాడ దుర్గగుడి ఆలయ కమిటీ కొత్త సభ్యుల నియామకం

Satyam News

జీ–20 శిఖరాగ్ర సమావేశం బాయ్ కాట్

Satyam News

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం

Satyam News

Leave a Comment

error: Content is protected !!