ప్రత్యేకంహోమ్

ఇరాన్ కు రష్యా సహాయం చేస్తున్నది: జెలెన్‌స్కీ

#zelensky

రష్యా తన సైనిక సహకారాన్ని ఇరాన్, ఉత్తర కొరియా, చైనాలకు అందచేస్తోతున్నదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు. ఈ పరిణామాలు ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ మాట్లాడుతూ, ఉత్తర కొరియా రష్యాకు సుమారు 30 వేల మంది సైనికులను పంపే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ఇరాన్ కూడా అదనపు క్షిపణులను రష్యాకు అందించే అవకాశం ఉందని చెప్పారు.

ఇరాన్ ఉక్రెయిన్‌పై నేరుగా దాడి చేసే అవకాశంపై ప్రశ్నించగా, “ఇరాన్ ఇప్పటికే ఈ యుద్ధంలో భాగస్వామిగా మారింది. రష్యాకు ఆయుధాలను సరఫరా చేయడం ద్వారా యుద్ధంలో పాల్గొంటోంది” అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

“ఈ వ్యక్తులను మేము నమ్మలేం. ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండానే యుద్ధం ప్రారంభ దశలోనే ఇరాన్ రష్యాకు ఆయుధాలను అందించింది. మరో కొత్త యుద్ధ రంగం తెరుచుకోకుండా మనం చేయాల్సినదంతా చేయాలి. కానీ ఇరానీయులు, ఉత్తర కొరియన్లు ఇప్పటికే మాపై దాడి చేసినట్టే” అని ఆయన వ్యాఖ్యానించారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటికే ఉత్తర కొరియా ఆయుధాలు, సైనిక సహకారం అందిస్తోందని పాశ్చాత్య దేశాలు పలుమార్లు ఆరోపించాయి. అలాగే ఇరాన్ తయారు చేసిన డ్రోన్లు, క్షిపణులను రష్యా వినియోగిస్తోందని కూడా అమెరికా, యూరోపియన్ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Related posts

భారత్ రష్యా బంధం మరింత ధృఢంగా ముందుకు…

Satyam News

ఇరాన్ రక్షణ వ్యవస్థ పై అమెరికా భీకర దాడులు

Satyam News

వై.ఎస్.జ‌గ‌న్ వి హింసా రాజకీయాలు

Satyam News

ఎఫ్‌సీవీ పొగాకు కొనుగోళ్లలో గణనీయమైన పురోగతి

Satyam News

డాక్టర్ ప్రియాంకపై దాడిని ఖండించిన ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

Satyam News

కరాచీ లో అమెరికా కాన్సులేట్ పై దాడి: 20 మంది మృతి

Satyam News

Leave a Comment