23.8 C
Hyderabad
September 23, 2026
ముఖ్యంశాలుహోమ్

అల్పపీడన ప్రభావంతో రెండు రోజులు వర్షాలు

#rain

ఉపరితల ఆవర్తన ప్రభావంతో 24 గంటల్లోపు వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్  ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న రెండురోజులు రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతోపాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.  ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో చెట్లు, పోల్స్ , హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని సూచించారు.

రేపు శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం,  విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.  ఉత్తరాంధ్ర తీరం వెంబడి  గంటకు 40-50 కిమీ  వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని  విజ్ఞప్తి చేశారు.

శనివారం (08-08-2026):  శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, విశాఖ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు,  ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Related posts

విద్యుత్ సమస్యలు ఎదురైతే పరిష్కరించడానికి సిద్ధం

Satyam News

గల్ఫ్ యుద్ధం నేపధ్యం లో ప్రధాని మోడీ సమీక్ష

Satyam News

ప్రభుత్వ డాక్టర్లపై దాడులకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు

Satyam News

విశాఖ స్టీల్ ప్లాంట్‌ రికార్డ్‌… జనవరిలో భారీ లాభాలు

Satyam News

హైదరాబాద్ పోలీసు కమిషనర్ పరిధి మార్పు

Satyam News

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా!

Satyam News

Leave a Comment