ఆధ్యాత్మికంహోమ్

శ్రీశైల శరన్నవరాత్రి కి సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

#DasaraCelebrations

శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లిఖార్జున స్వామి దేవాలయంలో జరుగనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు ఆహ్వానం పలికారు. ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రికి తెలిపారు.

ఈ మేరకు ఆలయ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో యం.శ్రీనివాసరావు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక అందించారు. శ్రీశైల దేవస్థానం ఆలయ పండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేదాశీర్వచనం పలికారు. సీఎంకు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల చిత్రపటం, ప్రసాదాలను దేవాలయ అధికారులు అందించారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించి దేవస్థానం చేస్తున్న ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

Related posts

బీచుపల్లిలో రేపు శ్రీ సీతారాముల కళ్యాణం

Satyam News

చిన జీయర్‌ యూ టర్న్: వైసీపీలో డైలమా.!

Satyam News

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు

Satyam News

నల్ల బ్యాడ్జీలతో విద్యుత్ ఉద్యోగుల నిరసన

Satyam News

మహిళా పోలీస్ స్టేషన్ పై పెట్రోల్ బాటిల్ తో దాడి

Satyam News

Pirates: రెండు భారతీయ నౌకల హైజాక్

Satyam News

Leave a Comment