కృష్ణహోమ్

శ్రీ రాజరాజేశ్వరి అలంకృత అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్

#APGovernor

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ మంగళవారం దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి పైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయానికి చేరుకున్న గవర్నర్ కు అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ అమ్మవారి అంతరాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు గవర్నర్ కు వేదాశీస్సులు అందజేశారు. ఆయనకు దేవాదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, కమిషనర్ కె. రామచంద్రమోహన్, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనానాయక్ తదితరులు అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.

Related posts

వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు డిగ్రీ కళాశాల

Satyam News

మళ్లీ మళ్లీ జగన్ క్రెడిట్‌ చోరీ….

Satyam News

ప్రజావాణిలో 56 వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్

Satyam News

ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరిగిన శాకంబరీ ఉత్సవాలు

Satyam News

45 ఏళ్లకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు: చరిత్ర సృష్టించిన నితిన్

Satyam News

బీజేపీలోకి అవినాశ్‌, వైవీ..??జగన్‌కు హ్యాండ్‌ ఇస్తున్నారా..???

Satyam News

Leave a Comment