నల్గొండహోమ్

నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ

#Nekrekal

నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. గురువారం ఆయన నకిరేకల్ లోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఓపి రిజిస్టర్, ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శోభ, ఇతర డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందితో మాట్లాడారు . డాక్టర్లు సిబ్బంది హాజరు, ఫార్మసీ,ఎమర్జెన్సీ వార్డు, లేబర్ రూమ్, స్టోర్ రూమ్, గైనిక్ వార్డులను తనిఖీ చేశారు.

డాక్టర్లు ,సిబ్బంది సమయపాలన పాటించాలని, అలాగే ఆసుపత్రికి వచ్చిన వారందరికీ మంచి వైద్య సేవలందించాలని చెప్పారు. ఆసుపత్రిలో శానిటేషన్ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ,వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వానికి ఇదివరకే నివేదించడం జరిగిందని తెలిపారు. పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాటు చేయాలని, ఆస్పత్రి ఆవరణలో లైటింగ్, నీటి సరఫరా, పరిశుభ్రత ఉండేలా చూసుకోవాలని, ఎక్కడపడితే అక్కడ చేత వేయకుండా చూడాలని, వినియోగించిన సిరంజీలు, ఇతర చెత్త ను జాగ్రత్తగా  డిస్పోజ్ చేయాలని చెప్పారు. డాక్టర్లు,నర్సింగ్ స్టాఫ్,ఇతర సిబ్బంది సమయానికి రావాలని, విధులు సక్రమంగా నిర్వహించాలని అన్నారు.

జిల్లా కలెక్టర్  ఆయా వార్డులోని రోగులతో మాట్లాడుతూ డాక్టర్లు ఎలా సేవలందిస్తున్నారని? ఆసుపత్రి ఎలా ఉందని? అడిగి తెలుసుకున్నారు .ఆసుపత్రి ద్వారా నిర్వహించిన సాధారణ ప్రసవాలు సిజేరియన్ ప్రసవాల గురించి అడిగి తెలుసుకున్నారు.

Related posts

డ్రగ్స్ పై యుద్ధం: మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా పంజాబ్

Satyam News

కారుణ్య మ‌ర‌ణాల‌కు ఇక మార్గం సుగ‌మం

Satyam News

రామరాజ్యం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

Satyam News

బాధ్యతలు స్వీకరించిన డీజీపీ శివధర్ రెడ్డి

Satyam News

టీఆర్ఎస్ నేతలపై సీతక్క అనుచరుల దాడి

Satyam News

గోమాంసం గోడౌన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితి

Satyam News

Leave a Comment