ప్రత్యేకంహోమ్

నాలుగు రాష్ట్రాల్లో మళ్లీ పరువు పోగొట్టుకున్న కాంగ్రెస్

#RahulGandhi

ఈవీఎం లలో మోసం జరుగుతున్నదని అందువల్ల బ్యాటెల్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్న కాంగ్రెస్ పార్టీకి బ్యాలెట్ పేపర్ ఆధారంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘోర పరాజయం సంప్రాప్తించింది. అదీ కూడా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవమే మిగిలింది. కాంగ్రెస్‌కు 28 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక్కటీ దక్కలేదు.

ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులు ఎవరూ గెలవలేదు. ఓట్ల లెక్కింపు మంగళవారం ప్రారంభమవగా, కొన్ని స్థానాల్లో ఇంకా కొనసాగుతోంది. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కని పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, బ్యాలెట్‌ పత్రాలతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్న కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు రాజకీయంగా ఇబ్బందికరంగా మారాయి.

2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వెలువడుతున్న ఈ ఫలితాలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని 11 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ ఐదు స్థానాలను గెలుచుకోగా, సమాజ్‌వాదీ పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. మిగిలిన స్థానాల ఫలితాలు, ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో తుది పరిస్థితిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని అధికార మహాయుతి కూటమి మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ప్రతిపక్ష ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్‌) రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు ఎన్నికల లెక్కింపులో వెల్లడైంది. బిహార్‌లో జన సురాజ్‌ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకుని తన ఖాతా తెరిచింది. బీజేపీ, జనతాదళ్‌ (యునైటెడ్‌), రాష్ట్రీయ జనతాదళ్‌ ఒక్కో స్థానాన్ని గెలుచుకోగా, ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా విజయం సాధించారు.

కర్ణాటకలోనూ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ఓటమి పాలైంది. ప్రతిపక్ష జనతాదళ్‌ (సెక్యులర్‌) ఒక స్థానాన్ని అధికార కాంగ్రెస్‌ నుంచి కైవసం చేసుకోగా, బీజేపీ మూడు స్థానాలను నిలబెట్టుకుంది. ఈ ఫలితాలు కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌కు రాజకీయంగా ఇబ్బందికరంగా మారాయి.

బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్‌ భండారీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల ద్వారా ఎన్నికలు జరిగినా, బ్యాలెట్‌ పత్రాలతో నిర్వహించినా ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ బ్యాలెట్‌ పత్రాలతో జరిగిన 28 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిందని విమర్శించారు. ఈవీఎంలతో జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ రాజకీయాలను తిరస్కరిస్తున్నారని, ఇప్పుడు బ్యాలెట్‌ పత్రాల ఎన్నికల్లోనూ అదే తీర్పు ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రచారానికి సొంత పార్టీ వర్గాల మినహా బయట ఎక్కడా ఆదరణ లేదని భండారీ ఎద్దేవా చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ కూడా కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రదర్శనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌, కర్ణాటక రాష్ట్రాల్లోని 28 ఎమ్మెల్సీ స్థానాలకు బ్యాలెట్‌ పత్రాలతో ఎన్నికలు జరిగాయని పేర్కొంటూ, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎన్ని స్థానాలు గెలుచుకుందో ఊహించాలని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీపై బీజేపీ చేస్తున్న విమర్శలకు మరింత రాజకీయ ప్రాధాన్యం కల్పించాయి.

Related posts

మళ్లీ మళ్లీ జగన్ క్రెడిట్‌ చోరీ….

Satyam News

బచ్చలికూర జోసఫ్ సన్నిహితురాలిని కలిసిన జగన్

Satyam News

భారతీయులు లాగే మీరూ మాకు శత్రువులే : పాకిస్తాన్

Satyam News

భూ రీ-సర్వేను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి

Satyam News

శ్రీవారి పాదసన్నిధిలో సీఎం చంద్రబాబు కుటుంబం

Satyam News

చిల్కూరు రంగరాజన్‌కు వివేకానంద పురస్కారం

Satyam News

Leave a Comment