ముఖ్యంశాలుహోమ్

బచ్చలికూర జోసఫ్ సన్నిహితురాలిని కలిసిన జగన్

బచ్చలికూర జోసఫ్ ఎలియాస్ ప్రశ్న రావణ్ తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రచారం చేసుకుంటున్న జగన్ పార్టీ మరి నేడు గన్నవరం విమానాశ్రయంలో జరిగిన ఒక సంఘటనకు ఎలాంటి వివరణ ఇస్తుంది? విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి రావణ్ సహచరురాలు గగన్‌ను కలిసి మాట్లాడారు.

తాము రావణ్ వెనకే ఉంటామని హామీ ఇచ్చారు.  మరి వారి పార్టీకి సంబంధం లేకపోతే గగన్ ను ఆయన ఎలా కలిశారు? ఇదే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం అయింది. విమానాశ్రయంలోకి వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్న రావణ్ సహచరురాలు గగన్‌ను మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు జగన్‌కు పరిచయం చేశారు.

గగన్‌ను గమనించిన జగన్ ముందుకు వెళ్లిన తర్వాత తిరిగి వెనక్కి వచ్చి ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా గగన్‌కు ధైర్యం చెప్పిన జగన్, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అతనికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చినట్లు సమాచారం.

పార్టీ తనకు పూర్తి మద్దతుగా ఉంటుందని, అవసరమైన ప్రతి సహాయాన్ని అందిస్తామని జగన్ పేర్కొన్నట్లు అక్కడ ఉన్న నాయకులు తెలిపారు. అంతేకాకుండా, పార్టీ నాయకుడు దేవినేని అవినాష్ తో టచ్ లో ఉండాలని, ఏ సమస్య వచ్చినా ఆయనతో నేరుగా మాట్లాడవచ్చని జగన్ గగన్‌కు సూచించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కొద్దిసేపు గగన్‌తో మాట్లాడిన జగన్ ఆమెకి ధైర్యం నూరిపోసి అక్కడి నుంచి తన ప్రయాణాన్ని కొనసాగించారు.

Related posts

బద్దలవుతున్న జగన్‌ పీఏ అవినీతి కొండ….!!

Satyam News

పాకిస్తాన్ ను చావుదెబ్బ కొట్టాం

Satyam News

ప్రత్యేక ఓటరు సవరణ పట్ల అప్రమత్తంగా ఉండాలి

Satyam News

దుబాయ్ లో చిక్కుకుపోయిన వారు సురక్షితంగా….

Satyam News

నాదర్గుల్ చెరువు కబ్జా చేస్తుంటే హైడ్రా నిద్రపోతుందా?

Satyam News

పేర్ని, జోగి…. జగన్ కు తలపోటు

Satyam News

Leave a Comment