ఆధ్యాత్మికంహోమ్

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ సమీక్ష

#Tirumala

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి గురువారం సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఉన్న సుధర్మ సమావేశ మందిరంలో సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనాలకు ప్రణాళికాబద్ధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు 7.83 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించిన అనుభవంతో ఈసారి కూడా మరింత సమర్థవంతంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

తొలి మూడు రోజులు ఈ-డిప్ ద్వారా టోకెన్లు

సాధారణ భక్తులకు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం కల్పించేందుకు తొలి మూడు రోజుల పాటు ఆన్‌లైన్ ఈ-డిప్ విధానంలో ఎస్‌ఎస్‌డీ టోకెన్లు కేటాయించాలని తెలిపారు. తదుపరి ఏడు రోజులు సర్వదర్శనం అమలు చేయాలని ఆదేశించారు. డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం స్వామివారి అభిషేక సేవ సమయంలో కూడా సర్వదర్శనం భక్తులకు దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా దర్శన క్యూ లైన్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, సామాన్య భక్తులకు వీలైనంత త్వరగా స్వామివారి దర్శనం కల్పించేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

భద్రత, పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి

సీవీఎస్వో మురళీకృష్ణ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. తిరుమలలో పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. చివరి ఏడు రోజుల్లో భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు భద్రతా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో టీటీడీ చీఫ్ ఇంజినీర్ మనోహరం, డిప్యూటీ ఈవోలు భాస్కర్, రాజేంద్ర, వేంకటేశ్వర్లు, సోమన్నారాయణ, రమాకాంత్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ కుమారి, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఐటీ జీఎం వేంకటేశ్వర్లు నాయుడు, ఎస్ఈలు వేంకటేశ్వర్లు, వేణుగోపాల్, వీజీవో సురేంద్ర, క్యాటరింగ్ స్పెషల్ ఆఫీసర్ శాస్త్రీ తదితర అధికారులు పాల్గొన్నారు.

Related posts

శ్రీవారి భక్తుడితో దురుసుగా ప్రవర్తించిన టాక్సీ డ్రైవర్‌పై చర్యలు

Satyam News

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం: 41 మంది మృతి?

Satyam News

వృద్ధి రేటు పెరుగుదలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Satyam News

అమరావతిలో ఆస్ట్రో ఫిజిక్స్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం

Satyam News

ముగ్గురు అక్కాచెల్లెళ్లు…. ఒకే మొగుడు…. వీడియో వైరల్

Satyam News

మధ్యప్రదేశ్ లో ఇక యూనిఫామ్ సివిల్ కోడ్

Satyam News

Leave a Comment