విశాఖపట్నంలోని దువ్వాడ ప్రాంతంలో బ్యూటీ సెలూన్ ముసుగులో వ్యభిచారం చేస్తున్న వారి గుట్టును పోలీసులు రట్టు చేశారు. అక్కడి లావిసి బ్యూటీ సెలూన్ ముసుగులో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం ఆధారంగా సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల సందర్భంగా ముగ్గురు మహిళలతో పాటు ముగ్గురు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని దువ్వాడ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఎస్ఐ భరత్ కుమార్ రాజు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
previous post