26.7 C
Hyderabad
September 20, 2026
సినిమాహోమ్

రెండో వివాహం చేసుకున్న నటి సమంత

#Samantha

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు రెండోసారి వివాహ బంధంలో అడుగుపెట్టారు. ఆమె, దర్శకుడు రాజ్ నిడిమోరుతో డిసెంబర్ 1న కోయంబత్తూరు ఇషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో సంప్రదాయ రీతిలో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ వేడుక పూర్తిగా వ్యక్తిగతంగా, ఎంతో సాదాసీదాగా జరిగింది.

వివాహానంతరం సమంత తన సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలను “01.12.2025” అనే క్యాప్షన్‌తో పంచుకోగా, అవి కొద్ది గంటల్లోనే వైరల్ అయ్యాయి. ఎర్రటి పట్టు సారీ, సంప్రదాయ ఆభరణాలతో సమంత మెరిసిపోగా, రాజ్ నిడిమోరు తెలుపు కుర్తా పజామా, బీజు జాకెట్‌లో సాదాసీదా లుక్‌లో కనిపించారు.

మొదటి భర్త నాగ చైతన్యతో 2021లో విడాకులు తీసుకున్న సమంత, అప్పటి నుంచి వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా స్పందించలేదు. మరోవైపు రాజ్ నిడిమోరు కూడా గతంలో తన భార్యతో విడిపోయినట్లు వార్తలు వెలువడడంతో, ఈ పెళ్లి ఇద్దరికీ రెండో వివాహంగా నిలిచింది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య సన్నిహితత్వం పెరిగిందని, ప్రేమలో ఉన్నారనే ప్రచారం వినిపించినా, ఇద్దరూ అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

అయితే అకస్మాత్తుగా జరిగిన ఈ వివాహంతో ఆ ఊహాగానాలన్నీ నిజమయ్యాయి. సమంత రాజ్ వివాహ వార్త సినీ పరిశ్రమలో, అభిమానుల్లో సంచలనంగా మారి, సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ ప్రారంభమైంది. కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related posts

జగన్‌ మత ఉగ్రవాది…..  బాంబు పేల్చిన విజయసాయి!

Satyam News

సజ్జనార్ వార్నింగ్తో భయపడ్డ యూట్యూబర్లు

Satyam News

వైసీపీ సింపతీ ఫార్ములాకు ఎక్స్‌పైరీ డేట్.. జనాల్లో రివర్స్ ఎఫెక్ట్‌!

Satyam News

పెన్సిల్వేనియాలో కాల్పులు: ఒకరి హత్య

Satyam News

నిరవధిక నిరాహార దీక్ష మొదలుపెట్టిన ‘కాక్రోచ్’ వ్యవస్థాపకుడు

Satyam News

వనపర్తిలో జిల్లా ఎస్పీ సునితకు స్వాగతం

Satyam News

Leave a Comment