23.8 C
Hyderabad
September 23, 2026
చిత్తూరుహోమ్

తిరుమలలో శాలువాల కుంభకోణంపై విచారణ

#Tirumala

తిరుమలలో పట్టు శాలువాల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ బీ ఆర్ నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ అవకతవకలలో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మార్కెట్‌లో రూ.350కే లభించే శాలువాలను టీటీడీకి రూ.1,350కు సరఫరా చేయడం పెద్ద కుంభకోణమని ఆయన ఆరోపించారు.

ఈ విషయంపై బోర్డు సమావేశంలో సమగ్రంగా చర్చించాకే ఏసీబీ విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. టీటీడీ ప్రతి ఏడాదీ సుమారు రూ.20 కోట్ల విలువైన పట్టు శాలువాలను కొనుగోలు చేస్తోందని, అయితే 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.80 నుంచి 90 కోట్ల మేర అవినీతి జరిగినట్టు ప్రాథమిక సమాచారం వెలుగులోకి వచ్చిందని నాయుడు వెల్లడించారు. ఏసీబీ విచారణ పూర్తయ్యి నివేదిక వచ్చిన వెంటనే చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో టీటీడీ వ్యవస్థలో భారీ అవినీతి చోటుచేసుకుందని, కల్తీ నెయ్యి సరఫరా, నాసిరకం సామగ్రి కొనుగోళ్లు, పరకామణి చోరీ వంటి ఘటనలు అప్పటి బోర్డు పాలనలోనే జరిగాయన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో వారికి అనుకూలంగా టెండర్లు కేటాయించిన విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయని బి.ఆర్. నాయుడు పేర్కొన్నారు.

Related posts

తెనాలి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన భవనం ప్రారంభం

Satyam News

AIతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు

Satyam News

జాతీయ ప్రేరణ ఉత్సవ్ పోటీలకు పట్నం రెడ్డి సాయి ఎంపిక

Satyam News

కల్వకుంట్ల కవితకు డిపాజిట్లు కూడా రావు

Satyam News

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు పొడిగింపు

Satyam News

ఎన్నిక ఏదైనా కాంగ్రెస్‌దే విజయం

Satyam News

Leave a Comment