26.7 C
Hyderabad
September 20, 2026
సినిమాహోమ్

“బిగ్ బాస్” నాకు ఎంతో ఇచ్చాడు: టాప్ 4 ఫైనలిస్ట్ ఇమ్మాన్యుల్

#BigBoss

బిగ్ బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నాడు ప్రముఖ నటుడు ఇమ్మాన్యుల్. ‘జబర్దస్త్’తో కోట్లాదిమంది అభిమానాన్ని దండిగా గెలుచుకున్న ఇమ్మాన్యుల్…. బిగ్ బాస్ లోనూ తనదైన శైలిలో అలరించి టాప్ 4 ఫైనలిస్ట్ గా నిలిచాడు. ఈ సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించాడు. బిగ్ బాస్ అనుభవాన్ని తాను ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటానని పేర్కొన్న ఇమ్మాన్యుల్… అందులో తనతో పాల్గొన్న సహ పార్టిసిపెంట్స్ తో తన అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ముఖ్యంగా సంజనాతో తనకు ఏర్పడిన ప్రత్యేక అనుబంధం జీవితాంతం ఉంటుందని తెలిపాడు!!

బిగ్ బాస్ లో ప్రతి ఒక్కరూ నటిస్తారని అందరూ అనుకుంటారని, కానీ గంటల తరబడి, వారాల తరబడి, రోజుల తరబడి నటించగలిగే మహానటులు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరని వివరించాడు. బిగ్ బాస్ జర్నీలో తనకు బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా “విజనరీ వౌస్” కి కృతజ్ఞతలు తెలిపాడు. బిగ్ బాస్ నుంచి నేర్చుకున్న ఎన్నో విలువైన విషయాలను తన కెరీర్ లో, జీవితంలో అనుసరించే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచిన కల్యాణ్ కు కంగ్రాట్స్ చెప్పిన ఇమ్మాన్యూల్… తనకు మొదటి స్థానం దక్కలేదనే అసంతృప్తి ఏ కోశానా లేదని అన్నాడు!!

Related posts

కేసీఆర్ పై హరీష్ రావు భావోద్వేగ వ్యాఖ్యలు

Satyam News

సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్‌వాటర్ ఆక్వాకల్చర్‌ ప్రత్యేకత ఇదీ

Satyam News

లంచం తీసుకుంటూ బుక్కయిన సర్వేయర్

Satyam News

బూతుల పర్వం వెనక ఐప్యాక్‌ స్కెచ్‌….??

Satyam News

కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం

Satyam News

ఒరిస్సాలో ఉపరితల ఆవర్తనంతో మారిన వాతావరణం

Satyam News

Leave a Comment