26.3 C
Hyderabad
September 19, 2026
కృష్ణహోమ్

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్లకు షాక్..నాన్ బెయిలబుల్ వారెంట్‌!

#GorantlaMadhav

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు బిగ్‌షాక్ తగిలింది. విజయవాడ పోక్సో కోర్టు నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గతంలో జరిగిన ఓ అత్యాచార ఘటనకు సంబంధించిన కేసులో, బాధితురాలైన మైనర్ బాలిక వివరాలను, ఆమె గుర్తింపును బహిర్గతం చేశారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. చట్టప్రకారం మైనర్ బాధితుల వివరాలను వెల్లడించడం తీవ్రమైన నేరం కావడంతో ఈ విషయాన్ని కోర్టు సీరియస్‌గా తీసుకుంది.

మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గోరంట్ల మాధవ్‌పై కేసు నమోదు చేశారు. బాధితురాలి గోప్యతను కాపాడాల్సింది పోయి, ఆమె వివరాలను బయటపెట్టడం ద్వారా చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

విజయవాడ పోక్సో న్యాయస్థానంలో శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చింది. దీనికి గోరంట్ల మాధవ్‌ గైర్హాజరయ్యారు. దీంతో అతనిపై నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేయడంతో ఏ క్షణమైనా పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంటుంది. కేసు తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు.

గోరంట్ల మాధవ్‌ మొదటి నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ఎంపీగా ఉన్న సమయంలో మహిళతో జరిపిన న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

Related posts

దువ్వాడ, అనంతబాబు రీఎంట్రీ…. జగన్‌ యూటర్న్..??

Satyam News

పిఠాపురం నుంచి వర్మ అవుట్..కమిటీకి కసరత్తు!

Satyam News

ఎసిబి వలలో వనపర్తి జిల్లా సివిల్ సప్లయి డి.ఎం

Satyam News

మళ్లీ మళ్లీ జగన్ క్రెడిట్‌ చోరీ….

Satyam News

ఫేక్ ప్రచారం చేసిన భూమన మనుషుల అరెస్టు

Satyam News

ABN ఎండీ రాధాకృష్ణకు ప్రాణహాని..??

Satyam News

Leave a Comment