26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

కూటమికి తిరుగులేదు జగన్ పార్టీకి బతుకులేదు

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, సీఓటర్ (CVoter) వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్‌ముఖ్ మరియు సీనియర్ జర్నలిస్ట్ బర్ఖా దత్ మధ్య జరిగిన తాజా చర్చలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు వెలువడ్డాయి.

ప్రస్తుతం ఏపీలో అధికార కూటమి (TDP-JSP-BJP) బలం గణనీయంగా పెరిగిందని, ప్రత్యర్థుల కంటే దాదాపు 20 శాతం ఓట్ షేర్ ఆధిక్యంలో ఉందని యశ్వంత్ దేశ్‌ముఖ్ వెల్లడించారు.
ముఖ్యంగా నారా లోకేష్‌లో వచ్చిన మార్పును ఆయన ఒక గొప్ప ‘కేస్ స్టడీ’గా అభివర్ణించారు.

రెండు ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో రాజకీయ చిత్రపటంలో లోకేష్ ప్రభావం అంతగా లేదని, కానీ ఇప్పుడు ఆయన అద్భుతమైన మార్పును కనబరిచారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి అభ్యర్థిత్వ రేటింగ్స్‌లో లోకేష్ దాదాపు టీడీపీ ఓట్ బేస్‌ను తన వైపుకు తిప్పుకున్నారని, జనాదరణలో తన తండ్రి కంటే కేవలం 10 శాతం మాత్రమే తక్కువ రేటింగ్‌లో ఉన్నారని విశ్లేషించారు.
జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రుల పనితీరుపై జరిగిన సర్వేలో చంద్రబాబు నాయుడు నంబర్ వన్ స్థానంలో నిలిచారని, ఆయన రేటింగ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమానంగా ఉందని దేశ్‌ముఖ్ తెలిపారు.

చంద్రబాబు నాయుడి అనుభవం, పవన్ కళ్యాణ్ కు ఉన్న ప్రజాకర్షణ కలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి తిరుగులేదని ఆయన అంచనా వేశారు. పార్టీలో వారసత్వ క్రమం కూడా చాలా స్పష్టంగా ఉందని, నారా లోకేష్ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా చక్కగా రాణిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

Related posts

50 శాతం మెడికల్ సీట్లు అమ్ముకున్న జగన్

Satyam News

ఇరాన్ అణ్వాయుధాలపై రాజీ లేదు: ట్రంప్

Satyam News

ట్రాన్స్‌జెండర్లకు రాజకీయ సాధికారతకు శ్రీకారం

Satyam News

మహిళల ఆభివృద్ధి దేశానికి పునాది

Satyam News

గద్వాల జిల్లా కోర్టు సముదాయం పీజేపీ క్యాంపు లోనే నిర్మించాలి

Satyam News

భారత్ వైపు చూస్తే…. ఇక అంతే…

Satyam News

Leave a Comment