25.2 C
Hyderabad
September 20, 2026
కృష్ణహోమ్

రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి

#AswiniVaishnav

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని, కొత్త రైలు మార్గాలు, సర్వీసులు నడపాలని విజ్ఞాపన పత్రం సమర్పించారు. ఏపీని టచ్ చేస్తూ వెళ్లే మూడు హై స్పీడ్ రైల్ కారిడార్ల (హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు) ను బడ్జెట్ లో ప్రకటించినందుకు సీఎం ధన్యవాదాలు తెలిపారు.

సీఎం ప్రస్తావించిన అంశాలు:

బెంగళూరు-చెన్నై హై స్పీడ్ రైల్ కారిడారు తిరుపతిని కనెక్ట్ చేసేలా చూడాలి

దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యేలా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి

తాడిపత్రి నుంచి ముంబై జేఎన్ పీటీ  పోర్టుకు అరటి ఎగుమతులకు వీలుగా 50 శాతం రాయితీపై ఖాళీ రీఫర్ కంటైనర్లు కేటాయించాలి

విజయవాడ, విశాఖ, తిరుపతి, అమరావతిలలో గ్రీన్ ఫీల్డ్ మెగా కోచింగ్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాలి

ఉత్తర- దక్షిణ భారత్ కలిపేలా ఇటార్సీ- విజయవాడ మధ్య ప్రత్యేక సరకు రవాణా కారిడార్ ఏర్పాటుకు సహకారం అందించాలి.

ఏపీలోని పోర్టులను అనుసంధానిస్తూ విజయవాడ మీదుగా ఖరగ్ పూర్- చెన్నై మధ్య ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేయాలి.

రాయలసీమ సహా గిరిజన ప్రాంతాలను కనెక్టు చేసేలా వివిధ కొత్త రైల్వేమార్గాల ప్రతిపాదనల్ని ఆమోదించాలి.

విశాఖ-విజయవాడల మధ్య హైస్పీడ్, విజయవాడ-కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్, తిరుపతి-చిత్తూరు మధ్య హైస్పీడ్ లింక్ కారిడార్ మంజూరు చేయాలి.

హైదరాబాద్- శ్రీశైలం- మార్కాపురం కొత్త రైల్వే లైన్ ద్వారా శ్రీశైల పుణ్యక్షేత్రానికి కనెక్టివిటీని పెంచాలి.

తిరుపతి మీదుగా విజయవాడ-బెంగుళూరు మధ్య వందే భారత్ సర్వీసును నడపాలి.

వివిధ ఎక్స్ ప్రెస్ రైళ్లకు కుప్పంలో స్టాపింగ్ ఇవ్వటంతో పాటు రైలు బోగీ నిర్వహణ టెర్మినల్ ఏర్పాటు చేయాలి.

Related posts

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ రెడీ… ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు

Satyam News

కూరగాయల సాగు విస్తీర్ణం పెంపునకు కృషి

Satyam News

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌

Satyam News

అక్రమ స్కానింగ్ సెంటర్ల పై పూర్తి స్థాయి నిఘా

Satyam News

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు

Satyam News

సూపర్ స్మార్ట్ సిటీ గా నల్గొండ

Satyam News

Leave a Comment