25.2 C
Hyderabad
September 20, 2026
ముఖ్యంశాలుహోమ్

ఆ ఒక్క కారణంతో.. కూటమిలో తిరుగులేని ఐక్యత

#PavanKalyan

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలల కాలం పూర్తయింది. ఈ సమయంలో కూటమిలోని పార్టీల మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా.. పాలన సాఫీగా సాగడం మంచి పరిణామం. సాధారణంగా మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు.. నాయకుల మధ్య విభేదాలు తలెత్తడం సహజం. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ నేతలు అప్పుడుప్పుడూ బీజేపీకి తలనొప్పిగా మారతారు. బీహార్‌లోనూ నితీశ్‌తో కాషాయ పార్టీకి మధ్య విభేదాలు సర్వ సాధారణం. ఇక తమిళనాడు డీఎంకేకి.. కాంగ్రెస్‌ నేతలు రోజుకో చికాకు తెచ్చి పెడుతూ ఉంటారు. కానీ ఏపీలో అలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా.. ఐకమత్యంగా, కలిసికట్టుగా ముందుకు సాగాలని మూడు పార్టీల ముఖ్య నాయకులు, శ్రేణులు భావిస్తున్నాయి.

కూటమిలో ఐక్యతమత్యానికి ప్రధాన కారణం.. ఈ పార్టీల నాయకులకు… ప్రజల మీద అభిమానం.. మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి.. మన ప్రజల అభ్యున్నతి కోసం పాటు పడాలనే తాపత్రయం.. ఈ ఒక్క కారణంతోనే బూతులను భరిస్తూ.. తప్పుడు ప్రచారాలను ఎదుర్కొంటూ, కుట్రలను తిప్పికొడుతూ.. ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌. ప్రజల కోసం పని చేయడం ఒక రకమైన రాజకీయం అయితే.. కులం, మతం, ప్రాంతాల పేరుతో విభేదాలు సృష్టించి లాభపడాలని చూడటం రెండో రకం పోలిటిక్స్‌. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఫస్ట్‌ క్లాస్‌ పోలిటిక్స్ చేస్తుంటే.. విపక్షంలో ఉన్న వైసీపీ దో నంబర్‌ దందానే నమ్ముకొంది. వాళ్లు అధికారంలో ఉండగా కల్తీలు, నకిలీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న సంగతి అందిరికీ తెలిసిందే.

వాస్తవం ఇలా ఉంటే.. బ్లూ మీడియా మేధావులు మాత్రం.. జగన్‌ అంటే భయంతోనే కూటమి పార్టీలు కలిసి ఉన్నాయని గప్పాలు కొడుతున్నారు. రాష్ట్రంలో 60 శాతం ప్రజలు జగన్‌ని చూసి భయపడుతున్నారని చెప్పుకొని.. అదే గొప్పతనం అనుకొనే వాళ్లను ఎవరికి చూపించినా ఉపయోగం ఉండదు. ఒక వ్యక్తిని చూసి కోట్ల మంది భయపడుతున్నారంటే.. అతను ఎలాంటి వాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతనికి వ్యతిరేకంగా ప్రత్యర్ధులంతా ఏకమైతే.. అది వాళ్లకి ప్లస్సో.. మైనస్సో కూడా అర్ధం చేసుకోలేకపోతే.. దాన్ని మూర్ఖత్వం అంటారు.

Related posts

పవిత్ర తిరుమల కొండపై కర్ణాటక కుట్ర

Satyam News

అమెరికాకు లోకేష్..పెరిగిన అంచనాలు.!

Satyam News

వారితో పోటీ పడటం కష్టంగా ఉంది…..

Satyam News

మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా మారితోనే స‌మాజ ప్ర‌గ‌తి

Satyam News

ఇంకా బలంగానే ఉన్న పాకిస్థాన్ ఉగ్రవాదులు

Satyam News

రోజువారీ కూలి… జీఎస్టీ బకాయి రూ.35 కోట్లు…

Satyam News

Leave a Comment