26.7 C
Hyderabad
September 20, 2026
విశాఖపట్నంహోమ్

దేవదేవుడి లడ్డూ కల్తీపై గర్జించిన స్వామీజీలు

#Vizag

తిరుమల దేవదేవుని లడ్డూ కల్తీపై ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం (ఆందోళన) నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆధ్వర్యంలో తయారయ్యే ప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలపై సాధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేవదేవుని ప్రసాద పవిత్రతను కాపాడాలని, ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అదే విధంగా, గత ప్రభుత్వం కాలంలో జగన్ మోహన్ రెడ్డి మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందూ సమాజంపై దాడులు చేశారని, 300కు పైగా దేవాలయాలను ధ్వంసం చేశారని సాధువులు ఆరోపించారు.

తిరుమల లడ్డూలో అసలు నెయ్యి ఉపయోగించకుండా రసాయనాలతో తయారు చేసిన నెయ్యితో లడ్డూలు చేయడం మహాపాపమని పేర్కొన్నారు. దీనికి ప్రాయశ్చిత్తం జరగాలని, ఈ ఘోర తప్పిదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హిందువులందరూ ఒక్కటై ముందుకు రావాలని, సాధు పరిషత్ ఆధ్వర్యంలో త్వరలో విజయవాడలో భారీ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి అని వ్యాఖ్యానించారు.

ఈ ఆందోళనలో పాల్గొన్న ప్రముఖులు: స్వామి శ్రీనివాస్ నంద సరస్వతి, ఆత్మానంద స్వామి, దయానంద స్వామి, గాయత్రి మాతాజీ, నిరంజన్ దాస్, యోగేష్ కృష్ణ నందగిరి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు ఇతర సాధువులు పాల్గొన్నారు.

Related posts

పెండింగ్ పనుల పూర్తికి ప్రాధాన్యత

Satyam News

షరతులు పాటిస్తేనే ఇక అమెరికాతో చర్చలు

Satyam News

జోర్డాన్ అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడి

Satyam News

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పై దాడి

Satyam News

యువకుల చేతిలో దాడికి గురైన వ్యక్తి మృతి

Satyam News

రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు

Satyam News

Leave a Comment