26.3 C
Hyderabad
September 19, 2026
గుంటూరుహోమ్

హోలీ వేడుకలలో విషాదం: ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం బసికాపురంలో హొలీ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం ఈతకు వెళ్లిన ఇంటర్ విద్యార్థి గోపి (16) దురదృష్టవశాత్తు కనుమూశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హొలీ వేడుకల సందర్భంగా నీటిగుంటలో ఈతకి దిగిన నలుగురు స్నేహితులు నీటి కుంటలో దిగారు.

కాసేపటి తర్వాత ఒడ్డుకు చేరుకున్న ముగ్గురు స్నేహితులు ఒడ్డుకు చేరగా, గోపి కనిపించలేదు. దీంతో స్నేహితులు గ్రామాలలోకి వెళ్లి గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా, వారు నీటిగుంటలో ఎనిమిది గంటలు గాలించి గోపిని బయటికి తీశారు. అప్పటికే గోపి మృతి చెందాడని తెలిపారు.

పండుగ రోజు కావడంతో విద్యార్థులు సరదాగా ఈతకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈత సరదా గోపి ప్రాణం తీసిందని కుటుంబ సభ్యులు విలపించారు. విద్యార్థి చనిపోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

Related posts

కుంభోత్సవ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం

Satyam News

షేక్ హసీనా నేరస్థురాలే: న్యాయస్థానం వెల్లడి

Satyam News

భారత పౌరసత్వం కోసం అన్నీ వదిలేసివచ్చిన వృద్ధురాలు

Satyam News

మత్స్యావతారంలో కనువిందు చేసిన శ్రీ సౌమ్యనాథస్వామి

Satyam News

ఇండక్షన్ స్టౌ లకు పెరిగిన డిమాండ్

Satyam News

పసికందు పై దాడి చేసిన వారిని పట్టించుకోరా

Satyam News

Leave a Comment