26.3 C
Hyderabad
September 19, 2026
ప్రపంచంహోమ్

యూట్యూబర్ నాన్సీ హత్యకు అసలు కారణం ఏమిటి?

#NancyGrawal

కెనడాలోని విండ్సర్ సమీపంలోని లాసాల్లీ వద్ద పంజాబీ మూలాలున్న యూట్యూబర్ నాన్సీ గ్రేవాల్ కత్తిపోట్లతో హత్యకు గురైన ఘటనపై సోషల్ మీడియాలో విభిన్నమైన, సంచలనాత్మక వాదనలు వెలుగులోకి వచ్చాయి. ప్రో-ఖలిస్తాన్ వాదనలకు అనుబంధంగా ఉన్న అనామక ఖాతాలు, అలాగే పంజాబ్‌కు చెందిన ప్రత్యర్థి గ్యాంగ్ నెట్‌వర్క్‌లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఈ ఘటనను తమదైన విధంగా ప్రచారం చేసుకుంటున్నాయి.

కొన్ని పోస్టుల్లో సిక్కు మత చిహ్నాలు, #Akash_Harike వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ఉపయోగిస్తూ, ఈ హత్యను “సిక్కు పంథ్ సోదరుల తరఫున” జరిపిన చర్యగా పేర్కొన్నారు. అందులో ఆకాశ్ హరికే, శుక్లా సంధూ పేర్లు ప్రస్తావించబడ్డాయి. ఖలిస్తాన్ ఉద్యమం, సిక్కు ధర్మంపై న్యాన్సీ గ్రేవాల్ తప్పుగా మాట్లాడిందని ఆరోపిస్తూ, ఆమె విమర్శలకు ప్రతీకారంగా ఈ హత్య చేశామని ఆ పోస్టులు పేర్కొన్నాయి.

ఇక మరోవైపు, మరో సోషల్ మీడియా పోస్టులో గ్యాంగ్‌స్టర్ గ్లోడీ బ్రార్ ఈ హత్య తమ వర్గమే చేసిందని ప్రకటించాడు. ఆ పోస్టులో సచిన్ బిష్ణోయ్, లారెన్స్ బిష్ణోయ్  గ్యాంగ్ పేర్లు కూడా ప్రస్తావించబడ్డాయి. ఆ సందేశాల్లో న్యాన్సీ గ్రేవాల్‌కు విక్కీ మిడ్డుఖెహ్రా హత్య (2021 ఆగస్టు, మొహాలీ), అలాగే అంకిత్ భాడూ ఎన్‌కౌంటర్ మరణంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ, ప్రతీకారంగా ఈ హత్య జరిగిందని పేర్కొన్నారు.

అయితే ఈ కేసుల్లో పోలీసుల నుంచి ఎలాంటి చర్యలు జరగలేదని కూడా పోస్టుల్లో పేర్కొన్నారు. కానీ పంజాబ్ పోలీస్ అధికారులు గోల్డీ బ్రార్ చేసిన ఈ ఆరోపణలను ఖండించారు. న్యాన్సీ గ్రేవాల్‌కు విక్కీ మిడ్డుఖెహ్రా హత్యతో లేదా అంకిత్ భడు ఎన్‌కౌంటర్‌తో ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. గోల్డీ బ్రార్ ఒకప్పుడు లారెన్స్ బిష్ణోయ్ సిండికేట్‌తో కలిసి పనిచేసినప్పటికీ, తరువాత వారి మధ్య విభేదాలు రావడంతో ప్రస్తుతం అతడు స్వతంత్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

ఇటీవల ఈ గ్యాంగ్ వర్గాల మధ్య పరస్పర దాడులు కూడా జరుగుతున్నాయి. పంజాబ్‌లో ఉన్న న్యాన్సీ గ్రేవాల్ కుటుంబ సభ్యులు మాత్రం ఆమె ఖలిస్తాన్ వ్యతిరేక వీడియోల కారణంగా ముందుగా బెదిరింపులు వచ్చాయని ఆరోపించారు.

Related posts

డాటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించండి

Satyam News

ఒరిస్సాలో ఉపరితల ఆవర్తనంతో మారిన వాతావరణం

Satyam News

వైసీపీకి బిరియానీ దెబ్బ… జాతీయ స్థాయిలో ఆగ్రహావేశాలు

Satyam News

తుంగభద్ర డ్యాం కొత్త స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవం

Satyam News

ఈడీ చేతిలో మద్యం కుంభకోణం కీలక ఆధారాలు

Satyam News

బడ్జెట్ ప్రభావంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Satyam News

Leave a Comment