26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

ప్రతి నియోజకవర్గంలో మహిళ దినోత్సవ వేడుకలు

#KritikaShuklaIAS

ఈ నెల 8వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో చేపట్టే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా కోరారు. డి.ఆర్.ఓ, ఆర్.డి.ఓలు, మున్సిపల్ కమిషనర్లు డిఆర్డీఏ, మెప్మా, ఐ.సి.డి.ఎస్ పిడిలు, వివిధ జిల్లా శాఖల అధికారులతో ఈ నెల 8 న జిల్లా కేంద్రంతోపాటు, అన్ని నియోజకవర్గాలలో నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లుపై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్లా మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో ఈ నెల 8 న నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే కార్యక్రమానికి 3 వేల మంది మహిళలు పాల్గొంటారని తెలిపారు.

జిల్లా కేంద్రం తోపాటుగా నియోజకవర్గాలలో మహిళ దినోత్సవం కార్యక్రమాలు నిర్వహించాలని నియోజకవర్గాల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం లో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించి మినిట్స్ తయారు చేయాలని ఐ సి డి ఎస్ పిడిని ఆదేశించారు. మెప్మా, డిఆర్డీఏ, ఐ సి డి ఎస్ పిడీలు మూడు వేల మంది మహిళలను సమకూర్చలని ఆదేశించారు.

స్త్రీ శక్తి మహిళ యాప్, మహిళ పోలీస్, డిఆర్డీఏ, మెప్మా, స్టాల్స్ ఏర్పాటు చేయాలని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని డి యం & హెచ్ ఓ ను ఆదేశించారు. డిఆర్డీఏ మెప్మా ద్వారా మెగా చెక్కును పంపిణీ చేయాలని పీడీలను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి లో నిర్వహించే ప్రోగ్రాం లో ముఖ్యమంత్రి పాల్గొనున్న కార్యక్రమం లైవ్ ఉంటుందని తెలిపారు.

జిల్లాలోని యం పి, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని తెలిపారు. మహిళ పారిశ్రామిక వేత్తలను సన్మానించడానికి, వారి విజయ గాధలను వారే వివరించేలా ఏర్పాట్లను చేయాలని డి.ఆర్.డి.ఏ పి.డి కు సూచించారు. అలాగే డి.ఆర్.డి.ఏ, మెప్మా, సంక్షేమ శాఖలు, పరిశ్రమల శాఖ, పోలీస్, శాఖల ద్వారా స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా మహిళలకు అందించే పథకాలకు సంబంధించిన వనరుల పంపిణీకి సిద్ధం చేయాలని సూచించారు.

Related posts

అనితకి అండగా లోకేష్‌, పవన్‌…. గుడివాడ అమర్‌నాథ్‌ పరుగులు

Satyam News

దేశ మహిళలను మోసం చేసిన బీజేపీ

Satyam News

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి.!

Satyam News

సనత్ నగర్‌లో రావణ దహనంలో పాల్గొన్న తలసాని

Satyam News

పవన్ కల్యాణ్ పై విమర్శలకు చంద్రబాబు సమాధానం

Satyam News

ఎన్నికల వ్యవస్థపై రాహుల్ ‘జ్ఞానోదయం’.!

Satyam News

Leave a Comment