25.2 C
Hyderabad
September 20, 2026
సినిమాహోమ్

‘పోలీస్ కంప్లైంట్’ కన్నడ టీజర్ విడుదల!

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది, కృష్ణ సాయి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఈ సినిమా కన్నడ వెర్షన్ టీజర్‌ను బెంగళూరులో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు.

ఈ వేడుకకు ‘దేవి’ సినిమా ఫేమ్ హీరోయిన్ ప్రేమ, ‘దండుపాళ్యం’ ఫేమ్ పూజా గాంధీ, కన్నడ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్.ఆర్.కె. విశ్వనాధ్ ముఖ్య అతిథులుగా హాజరై టీజర్‌ను ఆవిష్కరించారు.

ఎన్.ఆర్.కె. విశ్వనాధ్ మాట్లాడుతూ “దర్శకుడు సంజీవ్ మేగోటి పదేళ్ల తర్వాత మళ్లీ ఒక అద్భుతమైన కథతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం చాలా సంతోషకరం. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

నటి ప్రేమ మాట్లాడుతూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను, సినిమా మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. నటి రాగిణి మాట్లాడుతూ సినిమాపై నమ్మకం ఉంది. ఈ సినిమా స్క్రిప్ట్ చాలా బాగుందని, ‘పోలీస్ కంప్లైంట్’ ఒక అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ అని ఆమె ప్రశంసించారు. తక్కువ సమయంలోనే ఇంత క్వాలిటీతో సినిమాను తీసినందుకు దర్శక నిర్మాతలను అభినందించారు. వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర వంటి ప్రతిభావంతులతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పారు.

దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ “కేవలం 45రోజుల్లో 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో ఈ సినిమాను రూపొందించడం ఒక గొప్ప అనుభవం. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ప్రేక్షకులని తప్పకుండా ఆకట్టుకుంటుంది.”అని అన్నారు.

నటీనటులు:

బొమ్మాలి రవిశంకర్, శరత్ లోహితస్వా, ఆదిత్య ఓం, జెమినీ సురేష్, విజయభాస్కర్, దిల్ రమేష్ తదితరులు.

కెమెరా: హరీష్ SN, ఎడిటర్: అనుగోజు రేణుక బాబు, ఫైట్స్ (Action): డ్రాగన్ ప్రకాష్, రవితేజ, కొరియోగ్రఫీ: రాజ్ పైడి, సన్ రే (సూర్యకిరణ్), బాబా, ఆర్ట్ డైరెక్టర్: కె.వి. రమణ

#SanjevMegote

 

Related posts

రామ్‌గోపాల్ వర్మ అరెస్టు తప్పదా?

Satyam News

9న సువేందు అధికారి ప్రమాణ స్వీకారం?

Satyam News

కుక్కను కొట్టినందుకు పెళ్లి క్యాన్సిల్

Satyam News

స్వదేశీ న్యాయ శాస్త్రం కావాలి: చీఫ్ జస్టిస్

Satyam News

పోలవరం ప్రాజెక్టు సందర్శించిన రాష్ట్ర గవర్నర్

Satyam News

నేడే సరస్వతీ అంత్య పుష్కరాల ప్రారంభం

Satyam News

Leave a Comment