ప్రత్యేకంహోమ్

ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం: ఏడు రాష్ట్రాల్లో SIR

#ElectionCommissionOfIndia

తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. దేశంలోని ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)కు ఈసీ శ్రీకారం చుట్టింది. అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, మిజోరం, ఒడిశా, సిక్కిం ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు భారత ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది.

ఓటు హక్కు కలిగిన అర్హులందరికీ ఓటర్ల జాబితాలో స్థానం కల్పించడం ఈ ప్రత్యేక సవరణ ప్రధాన ఉద్దేశమని ఎన్నికల సంఘం తెలిపింది. ముఖ్యంగా యువత, తొలిసారిగా ఓటు హక్కు పొందనున్న వారికి ఈ ప్రక్రియ ద్వారా అవకాశం కల్పించనున్నారు. అంతేకాకుండా 2027 ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీల నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకుని ఓటు హక్కుకు అర్హత సాధించనున్న వారు ముందస్తుగానే దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించనున్నారు.

ఈ ప్రక్రియలో భాగంగా నవంబర్ 30న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల ప్రక్రియ అనంతరం 2027 జనవరి 21న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది, మౌలిక వసతులు, ఇతర వనరులను సమకూర్చాలని సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను ఎన్నికల సంఘం ఆదేశించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటర్ల జాబితాలో తప్పులు, లోపాలు లేకుండా చూడాలని ఈ ప్రక్రియ ద్వారా లక్ష్యంగా పెట్టుకుంది.

Related posts

శ్రీశైలానికి కాలినడకన చేరుకున్న కర్ణాటక భక్తులు

Satyam News

ఓటమి భయంతో జగన్‌ పరార్‌…!!

Satyam News

అమరావతిలో జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్టు ప్రారంభించాలి

Satyam News

గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై దాడులు తీవ్రం

Satyam News

బచ్చలికూర జోసఫ్ సన్నిహితురాలిని కలిసిన జగన్

Satyam News

ఐ ప్యాక్ డైరెక్టర్ ను అరెస్టు చేసిన ఈడీ

Satyam News

Leave a Comment