25.2 C
Hyderabad
September 20, 2026
కృష్ణహోమ్

సంక్షోభాలను జయించి..ఫీనిక్స్‌లా ఎగిసి.. 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానం….!!

#ChandrababuN

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ, గడిచిన ఐదేళ్లు తెలుగుదేశం పార్టీకి అగ్నిపరీక్ష. జగన్ ప్రభుత్వ అణచివేతను తట్టుకుని, శూన్యం నుండి శిఖరానికి చేరడం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది. మార్చి 29న పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకునేందుకు టీడీపీ సిద్ధమైంది. అక్రమ కేసులు, అర్థరాత్రి అరెస్టులు, శారీరక దాడులు, పార్టీ అధినేత చంద్రబాబును జైలుకు పంపిన అరాచక పాలన.. ఇలా అడుగడుగునా అణచివేతే లక్ష్యంగా సాగిన కుట్రలను తట్టుకుని నిలబడటం టీడీపీకే సాధ్యమైంది.

పార్టీ పని అయిపోయింది అంటూ విమర్శకులు ఎగతాళి చేసిన చోటే, ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా మారాడు. జైళ్లకు వెళ్లినా వెన్నుచూపలేదు, ఆస్తులు ధ్వంసం చేసినా పసుపు జెండా వదల్లేదు. బూడిద నుంచి ఫీనిక్స్ పక్షిలా పైకి లేచి, సోషల్ మీడియా వేదికగా, ప్రజల మధ్య ఆనాటి ప్రభుత్వ వ్యతిరేక గళాన్ని వినిపించారు. ఈ ఐదేళ్ల పోరాటమే 2024 ఎన్నికల్లో అఖండ విజయానికి పునాది వేసింది. కూటమిగా ఏర్పడి జగన్ అహంకార పాలనకు చరమగీతం పాడింది. 164 స్థానాల మెజారిటీ సాధించడం కేవలం గెలుపు కాదు..రాక్షస మూకపై సామాన్య కార్యకర్త సాధించిన ప్రజాస్వామ్య విజయం.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వైభవం సంతరించుకుంది. స్వర్ణాంధ్ర నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆగిపోయిన అమరావతి పనులు పరుగులు పెడుతున్నాయి, పోలవరం కల సాకారమవుతోంది, సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల్లా సుపరిపాలన సాగుతోంది.

43 ఏళ్ల క్రితం మొదలైన తెలుగుదేశం ప్రస్థానం ఇవాళ్టికి ఉద్ధృతంగా సాగుతోంది. తెలుగు జాతి ఉన్నంత కాలం, పసుపు జెండా రెపరెపలాడుతున్నంత కాలం..అవకాశం వచ్చినప్పుడల్లా సామాన్యుడి గొంతుకగా, అండగా నిలబడుతూనే ఉంటామని TDP నిరూపించింది.

Related posts

ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖ

Satyam News

సరస్వతి దేవాలయంలో అష్టాదశ శక్తి పీఠాల విగ్రహాల ప్రతిష్ట

Satyam News

జర్నలిస్టుల హెల్త్ కార్డుల సమస్య త్వరలో పరిష్కరిస్తా

Satyam News

వృద్ధి రేటు పెరుగుదలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Satyam News

జగన్ పీఆర్ఓ పూడి శ్రీహరిపై హైకోర్టు సంచలన నిర్ణయం

Satyam News

అయిజలో అంతర్జాతీయ మహిళా కబడ్డీ టోర్నమెంట్

Satyam News

Leave a Comment