25.2 C
Hyderabad
September 20, 2026
ఆధ్యాత్మికంహోమ్

ఈనెల 23 నుండి శ్రీ శేషదాసుల 141 ఆరాధన ఉత్సవాలు

#SriMoladakalluSeshadasu

శ్రీ పురందర దాసులవారి శిష్య పరంపరలో అపరోక్షజ్ఞానులైన హరిదాసులుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ మొదలకల్లు శేషదాసులవారు సకల మధ్వులకూ చిరపరిచితులు, వీరు అనేక ఉగాభోగములు, సుళాదులు మరియు కీర్తనలను రచించినారు.

శ్రీ శేషదాసులవారు గద్వాల్ తాలూక ధరూరు గ్రామం కరణం వంశంలో జన్మించినారు. వీరు ఇంద్రాంశ సంభూతులనుట జగద్విదితం, ఇంతేకాక వారు తమ కీర్తనలలో పూర్వజన్మంలో అర్జునులైన విషయం ఉల్లేఖించినారు.

వీరు తమ పూర్వ జన్మంలో శ్రీ జయతీర్థులుగా అవతరించి శ్రీ మధ్వాచార్యులను సేవించినారు.
శ్రీ మొదలకల్లు క్షేత్రము గద్వాల నుండి 16 కి.మీ. దూరంలో ఉండి, “ఆది శిలా క్షేత్రము” (గిరిశాచలము) గా పూర్వం పురాణ ప్రసిద్ధిగాంచినది.

శ్రీ శేషదాసులవారు చింతరేవుల గ్రామంలో వ్యాసరాయలచే ప్రతిష్ఠితమైన శ్రీ ఆంజనేయ స్వామిని సేవించి, శ్రీ విజయదాసులవారి పూర్ణానుగ్రహముతో “శ్రీ గురువిజయ విర్ధల” అను అంకితనామము పొందిరి.

శ్రీ పార్థివ నామ సంవత్సరము 1885 యుగాది నాడు ధరూరు నందు తమ స్వగృహములో శ్రీ పార్థసారథిని ప్రతిష్ఠించి మనుమడైన శ్రీ విజయరాయుల ఉపనయనమును అత్యంత వైభవముగా జరిపించి, అదే సంవత్సరము వైశాఖ శుద్ధ అష్టమి రోజున మొదలకల్లులో వైకుంఠయాత్ర చేసిరి. అదే స్థలంలో ఇప్పుడు ఒక కట్టను నిర్మించినారు.

వారి చేతులపైన నడచిన సత్రము ఇప్పటికీ “దాసుల సత్రము”గా ప్రసిద్ధిగాంచింది. ఇది స్వయంభూ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఎదురుగా ఉన్నందున, స్వాములవారి సేవకై దాసులవారు ఇచ్చటయే నివసించిరి.

మంత్రాలయ ప్రభువు ఆజ్ఞతో శ్రీ టంకసాలి శ్రీనివాసాచార్యులవారు (శ్రీ రఘుదాంత తీర్థులు తమ పూర్వాశ్రమములో) శ్రీ శేషదాసుల అష్టకము రచించగా దీని పారాయణము చేసి భక్తులు నేటికీ తమ ఇష్టార్థములు పొందుచున్నారు.

మొదలకల్లు శ్రీ శేషదాసుల 141వ ఆరాధన మహోత్సవమును శ్రీ పరాభవనామ సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి, అష్టమి, నవమి తిథులయందు తేది 23, 24, 25 ఏప్రిల్ 2026 రోజులలో శ్రీ దాసుల వంశీకులు, భక్త బృందము వైభవముగా ఆచరించుటకు నిర్ణయించడమైనది.

అందువలన సకల భక్త బృందం ఈ ఉత్సవమునకు విచ్చేసి తను, మన, ధనముతో శ్రీ శేషదాసుల సేవచేసి వారి ద్వారా శ్రీ హరివాయు గురువుల అనుగ్రహమునకు పాత్రులగుటకు కోరడమైనదనీ శేషదాసుల సేవా ట్రస్ట్ అధ్యక్షులు సి. ధీరేంద్ర దాస్ తెలిపారు.

కార్యక్రమ వివరాలు…

గురువారము, తేది 23-4-2026,
ఉ 8.00 పంచామృత అభిషేకము,
ఉ 9.00 శ్రీ ధన్వంతరి హోమము,
ఉ 11,00: పండితులచే ప్రవచనములు,
మ 12.30 తీర్ధ ప్రసాదము,
సా. 5.00 : భజనామండళివారిచే భజనా కార్యక్రమము,
సా 6.00 పండితులచే ప్రవచనములు,
సా 7.30 : దాసవాణి కార్యక్రమము,
శుక్రవారము, తేది 24-4-2026,
ఉ 7.30 పంచామృత అభిషేకము,
ఉ 8.00 : పవమాన హోమము,
ఉ 9.30 : రథోత్సవము – భజనచే వివిధ భజన మండళివారిచే
11.00 : పండితులచే ప్రవచనములు మరియు స్వస్తివాచనము,
మ 1.00 : తీర్థ ప్రసాదము,
సా 6.00 : పండితులచే ప్రవచనములు,
సా 7.30 : దాసవాణి కార్యక్రమము శనివారము, తేది 25-4-2026,
ఉ 8.00 : పంచామృత అభిషేకము,
ఉ 9.00 : శ్రీ సత్యనారాయణ పూజ,
ఉ 9.30 : భజనా మండళివారిచే భజనా కార్యక్రమము,
ఉ 10.30 : పండితులచే ప్రవచనములు,
మ 12.30 : తీర్ధ ప్రసాదము

Related posts

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

Satyam News

షర్మిల పై ఘాటు వ్యాఖ్యలు చేసిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు

Satyam News

సురభి నాటక రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి

Satyam News

సోనియా గాంధీ కేసు హైకోర్టు కు….

Satyam News

పోలీసుల వేధింపులతో ఉర్దూ అకాడమీ ఉద్యోగి ఆత్మహత్య?

Satyam News

లైసెన్స్డ్ సర్వేయర్లను నట్టేట ముంచిన రేవంత్ సర్కార్

Satyam News

Leave a Comment