26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

రాలిపోయిన ధృవతార: ఆశా భోంస్లే ఇక లేరు

భారతీయ సంగీత ప్రపంచంలో ఒక అద్భుత శకం ముగిసింది. లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఆశా భోంస్లే 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

గత కొన్ని రోజులుగా వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. శనివారం సాయంత్రం తీవ్రమైన అలసట, ఛాతి ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ (అవయవాల వైఫల్యం) గుండెపోటు కారణంగా ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఆశా భోంస్లే మరణవార్తను ఆమె కుమారుడు ఆనంద్ భోంస్లే మీడియాకు తెలియజేస్తూ, సోమవారం సాయంత్రం ముంబైలోని శివాజీ పార్కులో అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు.

ఎనిమిది దశాబ్దాల పాటు సాగిన తన సుదీర్ఘ ప్రయాణంలో ఆశా భోంస్లే 20కి పైగా భాషల్లో దాదాపు 12,500 కంటే ఎక్కువ పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. 1943లో మరాఠీ సినిమాతో మొదలైన ఆమె ప్రస్థానం, భారతీయ సినిమా సంగీత గమనాన్ని మార్చివేసింది.

మెలోడీ పాటలైనా, క్యాబరే సాంగ్స్ అయినా, గజల్స్ అయినా ఆమె గొంతులో పలికిన విలక్షణత అద్వితీయం. ఆమె మృతి పట్ల భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సంగీత సరస్వతి తన గళాన్ని మూగబోయేలా చేసిందని, ఆమె పాటలు సంగీత ప్రియుల హృదయాల్లో కలకాలం చిరంజీవిగా ఉంటాయని అభిమానులు నివాళులర్పిస్తున్నారు.

Related posts

రాయలసీమ లిఫ్ట్‌…. వైసీపీ వాదనలో అసలు నిజం ఇదే….!!

Satyam News

హెరిటేజ్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైసీపీ

Satyam News

ప్రపంచస్థాయి సాంకేతికతతో విపత్తు రక్షణ వ్యవస్థ బలోపేతం

Satyam News

సీబీఎన్@361 డిగ్రీస్ పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Satyam News

జగన్‌కి ఢిల్లీ సంకేతాలు…. బెంగళూరులో ఆ నేతలతో సీక్రెట్ మీటింగ్!

Satyam News

50 శాతం మెడికల్ సీట్లు అమ్ముకున్న జగన్

Satyam News

Leave a Comment