29.2 C
Hyderabad
September 21, 2026
ఆధ్యాత్మికంహోమ్

21 నుంచి శ్రీ ఆదిశంకరాచార్యుల రథయాత్ర ప్రారంభం

#Adishankara

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ ఆదిశంకరాచార్యుల వైభవాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మహత్తర రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ రథయాత్ర రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలను సందర్శిస్తూ సనాతన ధర్మ సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా వ్యాప్తి చేయనుంది.

యాత్రను ఈ నెల 21వ తేదీన తాడబండ అంజనేయస్వామి దేవాలయంలో ఘనంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ & ఇండస్ట్రీస్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ యాత్రను ప్రారంభించనున్నారు. శ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ గారి వేద స్వస్తితో ఈ కార్యక్రమం ఆరంభమవుతుంది.

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ధార్మిక సలహాదారు గోవింద్ హరి, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అతిథులుగా హాజరవుతారని నిర్వాహకులు, శ్రీ వేదభారతి ట్రస్టీ డాక్టర్ రేమల్లా అవధానులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ సహకారంతో ఈ రథయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ యాత్రలో భాగంగా:

ప్రతి గ్రామంలో శ్రీ శంకర జయంతోత్సవాలు నిర్వహించడం

శంకరాచార్యుల జీవిత చరిత్ర, స్తోత్రాలు, ముఖ్య శ్లోకాలతో కూడిన పుస్తకాలను సుమారు 1 లక్ష మంది విద్యార్థులకు పంపిణీ చేయడం

సుమారు 500 హైస్కూల్‌లలో ఈ పుస్తకాల పంపిణీ

108 శ్రీ శంకర విగ్రహాలను దేవాలయాలకు అందజేయడం

వేద సభలు, శాస్త్ర సభలు, సంస్కృత తరగతులు, విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించడం

వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రజలు ఈ యాత్రను విజయవంతం చేయాలని, ఆదిశంకరాచార్యుల తత్త్వాలను, జీవన విధానాన్ని, సనాతన ధర్మ సందేశాన్ని గ్రామ గ్రామానికి చేర్చాలని “భారతీయం” సంస్థ నిర్వాహకులు సత్యవాణి పిలుపునిచ్చారు.

శ్రీ ఆదిశంకరాచార్యుల రథయాత్రకు సంబంధించిన వెబ్‌సైట్, పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞ భారతీయ సంస్థ నిర్వాహకులు కిష్ణప్రసాద్, జీబీఎస్ శర్మ, సప్తపర్ణి ఫౌండేషన్ నిర్వాహకులు ప్రకాష్, 108 టీవీ చైర్మన్ జీ. నవీన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మాండభేరి గోపరాజు పాల్గొన్నారు.

Related posts

వారితో పోటీ పడటం కష్టంగా ఉంది…..

Satyam News

తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్ పార్టీ నేతలపై చర్యలు

Satyam News

‘ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్’ వ్యవస్థప్రారంభం

Satyam News

శాశ్వత రాజధానిగా అమరావతి: అసెంబ్లీ తీర్మానం

Satyam News

స్వీయ జనగణన ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద బాబు

Satyam News

వనపర్తిలో అవినీతి అధికారి పట్టివేత

Satyam News

Leave a Comment