26.7 C
Hyderabad
September 20, 2026
రంగారెడ్డిహోమ్

పకడ్బందీగా సంక్షేమ పథకాల అమలు

సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా చేపట్టే కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 20 నుండి 26 వరకు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణ రావు ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, సంక్షేమ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ జిల్లాలో 34 గురుకుల పాఠశాలలన్నాయని, ఇట్టి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. గురుకుల పాఠశాలలను ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసు కుంటున్నారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి కలెక్టర్ వివరించారు. సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా చిన్నచిన్న మరమ్మతు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఉమా శంకర్ ప్రసాద్, అదనపు కలెక్టర్ వెంకటా చారి, సీఈవో సుధీర్, డీఆర్ డిఓ శ్రీనివాస్, సిపిఓ వెంకటేశ్వర్లు, డిపిఓ జయసుధ, డిఇఓ రేణుకాదేవి, డిడబ్ల్యుఓ కృష్ణవేణి, డిటిడిఓ కమలాకర్ రెడ్డి, డిఎస్సీడీఓ జయపాల్ రెడ్డి, డిబిసిడిఓ మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్

Satyam News

భారత్‌ కు పాకిస్తాన్ రక్షణ మంత్రి హెచ్చరిక

Satyam News

ఇక గ్రేటర్‌ విజయవాడ… పదింతలు పెరుగుతుంది..

Satyam News

సమ్మిళిత అభివృద్ధిలో జనాభా లెక్కలు అవసరం

Satyam News

గంజాయి పై ఉక్కు పాదం: ఎస్పీ ఎ.ఆర్.దామోదర్

Satyam News

అణు పరీక్షలకు సిద్ధమైన పాకిస్తాన్?

Satyam News

Leave a Comment